జగన్ పార్టీ సీట్లు సోనియా ఖరారు చేస్తున్నారు: సోమిరెడ్డి

Somireddy Chandramohan Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకసభ అభ్యర్థుల పేర్లను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఖరారు చేస్తున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. కడప పౌరుషాన్ని జగన్ సోనియా కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని వ్యాఖ్యానించారు.

తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సొంతంగా తన ఆస్తులను ప్రకటిస్తుంటే, జగన్ ఆస్తులను మాత్రం సిబిఐ ప్రకటిస్తోందని సోమిరెడ్డి అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మాదిరిగా ఎన్టీ రామారావు తన వారసులకు గనుల లాంటివి అప్పంగించలేదని ఆయన చెప్పారు. అంబానీ, టాటాలు పోయి ఎక్కువ పన్నులు కట్టేవారి జాబితాలోకి జగన్ వచ్చారని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జగన్ ఏం చెప్తే అది చేశారని, ఆ రకంగా వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆయన ఆరోపించారు. జగన్‌కు ఎదురు మాట్లాడే ధైర్యం వైయస్ రాజశేఖర రెడ్డికి కూడా లేకుండా పోయిందని ఆయన అన్నారు.

ముడుపులు పోతాయనే భయంతో వైయస్ రాజశేఖర రెడ్డి తన ప్రభుత్వ హయాంలో కృష్ణా నది మిగులు జలాలపై హక్కు వదులుకుంటూ లేఖ రాశారని ఆయన చెప్పారు. కాంట్రాక్టర్ల వద్ద 5 వేల కోట్ల రూపాయల మేర మొబిలైజేషన్ అడ్వాన్సులు ఉండిపోయాయని ఆయన అన్నారు. రాయలసీమను రెండు విభజించాలనుకోవడం అన్యాయమని ఆయన అన్నారు. రాయలసీమ నాయకులు స్త్రీలు, పురుషులు కాని మూడో లింగంవారా అని ఆయన అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+