వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామోజీని ఒక్క రోజైనా జైల్లో ఉంచాలనుకున్నారు: జగన్‌పై సోమిరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లోనే దీక్ష చేసేవారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆడిపోసుకుంటే లాభంలేదని తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో పోరాటానికి జగన్‌ సిద్ధమా అని ఆయన సవాల్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సమస్యలు సృష్టిస్తుంటే జగన్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అడిగారు. అక్రమాస్తులు ప్రభుత్వానికి ఇచ్చి దీక్ష చేస్తే ప్రజలు నమ్ముతారని ఆయన అన్నారు.

తెలంగాణ వస్తే అన్ని సమస్యలు తీరతాయని ఆనాడు కెసిఆర్ చెప్పారని, ప్రత్యేక హోదా వస్తే అన్ని సమస్యలు తీరతాయని జగన్‌ కూడా అలాగే చెబుతున్నారని విమర్శించారు. ఈనాడు అధిపతి రామోజీరావును ఒక్కరోజైనా జైలులో ఉంచాలని అనాడు వైఎస్‌ జగన్‌ అనుకున్నారని గుర్తు చేశారు.

 Somireddy says YS Jagan deeksha politically motivated

జగన్‌ జైలుకెళ్లే పరిస్థితి రావడంతో రామోజీ దగ్గరకు వెళ్లారన్నారు. రామోజీరావును ఎందుకు కలిశారో జగన్‌ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ధర్నాతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందన్నారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోవడంతో మహిళ చనిపోయిందని ఆయన ఆరోపించారు.
తమ ప్రశ్నలకు జగన్‌ సమాధానం చెప్పాలని ఆ తర్వాతే దీక్ష చేయాలని ఆయన అన్నారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషి జగన్‌కు కన్పించడంలేదా? సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి తమ ప్రభుత్వం ఏం చేస్తోందో ప్రజలకు తెలుసునని ఆయన అననారు.

ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని జగన్ ఎందుకు నిలదీయడం లేదని, చంద్రబాబునే ఎందుకు లక్ష్యం చేసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై జగన్ రాజకీయం చేస్తున్నారని, ఇవ్వాల్సినవారిని అడగకుండా చంద్రబాబును లక్ష్యం చేసుకున్నారని ఆయన అన్నారు. విభజన చట్టం అమలుకు తాము కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. ప్రపంచ బ్యాంక్ నివేదిక జగన్‌కు కనిపించడం లేదా అని ఆయన అడిగారు.

English summary
Andhra Pradesh Telugu Desam party leader Somireddy Chandramohan Reddy criticised that YSR Congress party president YS Jagan deeksha is politically motivated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X