టీడీపీకి ఓటేశారనే: కేసీఆర్‌ని ఏకేసిన సోమిరెడ్డి, టీవీలపై

సాటి తెలుగు ప్రజల పట్ల కేసీఆర్ విపక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. కృష్ణా డెల్టా నీటి విడుదల పైన అనవసర వివాదం చేస్తున్నారన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ పైన తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉందన్నారు.
సాటి తెలుగు ప్రజలు అన్న కనికరం లేకుండా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. టీడీపీకి ఓట్లు వేశారని అయ్యప్ప సొసైటీ వారిని వేధిస్తున్నారని ఆరోపించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టీడీపీకి 70వేల ఓట్లు వచ్చాయనే కక్షతో పేదల ఇల్లు కూల్చివేయడం దారుణమన్నారు. నవ తెలంగాణ నిర్మాణం అన్న కేసీఆర్ శిథిలాలు మిగిల్చేలా ఉన్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో మీడియా పైన ఆంక్షలు పెడితే గవర్నర్ పట్టించుకోరా అని ప్రసఅనించారు.
సభ్యత్వం రద్దు: అశోక్ బాబు
తెలంగాణ ఉద్యోగుల వల్లనే ఏపీఎన్జీవో భూముల వివాదం రాజుకుందని ఏపీఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు వేరుగా అన్నారు. ఉద్యోగులు తెలంగాణలో ఆప్షన్ పెట్టుకుంటే ఏపీఎన్జీవోలో సభ్యత్వం రద్దు చేస్తామని, సంఘం ఆస్తులలో ప్లాట్లు కేటాయించమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఉద్యోగుల సర్వీసును 60 ఏళ్లకు పెంచడాన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు. ఏపీ ఉద్యోగులకు ఆప్షన్ ఇస్తే తాము టీ ఉద్యోగులకు మద్దతిస్తామని తెలిపారు. 12న చంద్రబాబుకు సన్మానం చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications