వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు బీజేపీ ప్లాన్; వైసీపీకి ఇప్పుడెందుకు గుర్తొచ్చిందో: సోము వీర్రాజు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 13 నుండి 26కు పెరిగిపోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఇక ఇదే సమయంలో జిల్లాల పేర్లు కూడా ఖరారు చేసింది. అయితే జిల్లాల ఏర్పాట్లపై అనేక జిల్లాలను పలు అభ్యంతరాలున్నాయి. ఈ అభ్యంతరాలను తెలియజేయడానికి కూడా నోటిఫికేషన్ ద్వారా అవకాశం ఇచ్చింది ఏపీ సర్కార్.

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభుత్వానికి ఇప్పుడే ఎందుకు గుర్తు వచ్చిందో: సోము వీర్రాజు

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభుత్వానికి ఇప్పుడే ఎందుకు గుర్తు వచ్చిందో: సోము వీర్రాజు

ఇదిలా ఉంటే కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతించిన ఏపీ బీజేపీ నేతలు, జగన్ సర్కార్ కు ఇప్పుడు ఉన్నట్లుండి కొత్త జిల్లాల ఏర్పాటు గుర్తుకురావడం వెనుక కారణం ఏమిటో చెప్పాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఇప్పుడే ఎందుకు గుర్తు వచ్చిందో చెప్పాలని జగన్ సర్కార్ ను ప్రశ్నించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా పరిస్థితులపై కూడా సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

బీజేపీపై వైసీపీ చేస్తున్న విమర్శలు అర్ధ రహితం

బీజేపీపై వైసీపీ చేస్తున్న విమర్శలు అర్ధ రహితం

రాష్ట్రంలో దేవాలయాల విధ్వంసకారులపై చర్యలేవి అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో బిజెపి అల్లకల్లోలం సృష్టిస్తోంది అని వైసీపీ చేస్తున్న విమర్శలు అర్థరహితమని సోము వీర్రాజు రివర్స్ కౌంటర్ ఇచ్చారు వైసిపి కేసులో పార్టీ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు గుడివాడకు వెళితే మీకు భయమెందుకని ఆయన వైసిపి నేతలను ప్రశ్నించారు. బిజెపి ప్రణాళికను వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన మండిపడ్డారు.

2014 బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలోనే కొత్త జిల్లాలు

2014 బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలోనే కొత్త జిల్లాలు

2014వ సంవత్సరంలోనే బిజెపి ఎన్నికల ప్రణాళికలో కొత్త జిల్లాల ఏర్పాటును పొందుపరచామని ఆయన స్పష్టం చేశారు. పరిపాలన పట్ల బీజేపీకి ఉన్న దూరదృష్టిని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు సోము వీర్రాజు. అంతేకాదు రెండేళ్ల క్రితమే మొత్తం 26 మంది జిల్లా అధ్యక్షులను పెట్టి జిల్లా కమిటీలను ఏర్పాటు చేశామని వెల్లడించారు సోము వీర్రాజు.

కొత్త జిల్లాల ఏర్పాటు పై రెండున్నర సంవత్సరాలు ఏం చేశారన్న సోము వీర్రాజు

కొత్త జిల్లాల ఏర్పాటు పై రెండున్నర సంవత్సరాలు ఏం చేశారన్న సోము వీర్రాజు

కొత్త జిల్లాల ఏర్పాటుపై రెండున్నర సంవత్సరాలు ఏం చేశారని ఆయన జగన్ ను ప్రశ్నించారు. జిల్లాల ఏర్పాటుపై ప్రతి జిల్లాకు ఒక కమిటీని ఏర్పాటు చేసి అభిప్రాయాన్ని సేకరించాలని సోము వీర్రాజు విజ్ఞప్తిచేశారు. జిల్లాలకు పేర్లు పెట్టే విషయంపై స్థానికంగా నివసిస్తున్న ప్రజల అభిప్రాయాలను తీసుకుని ఆయా జిల్లాలకు పేర్లు పెట్టాలని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన క్రెడిట్ భారతీయ జనతా పార్టీకి దగ్గర ఉందని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

అన్ని జిల్లాలకు అభివృద్ధి కార్యక్రమాలను వికేంద్రీకరించాలన్న సోము వీర్రాజు

అన్ని జిల్లాలకు అభివృద్ధి కార్యక్రమాలను వికేంద్రీకరించాలన్న సోము వీర్రాజు

పరిపాలన సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ఏపీ బీజేపీ 2014లోనే ఎన్నికల ప్రణాళికలో రూపొందించిందని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం దానిని అమలు చేసిందని, ఇందులో వైసిపి గొప్పతనం ఏమీ లేదని సోము వీర్రాజు చెప్పారు. నూతన జిల్లాల ఏర్పాటుతో పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్న విధంగానే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తశుద్ధితో అభివృద్ధి కార్యక్రమాలను కూడా నిర్వహించాలని, అన్ని జిల్లాలకు అభివృద్ధి కార్యక్రమాలను వికేంద్రీకరించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

English summary
Somu Veerraju interesting comments on jagan govt over new districts in ap. BJP plans to form new districts in AP; but YSRCP implementing now said Somu Veerraju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X