మోడీ టూర్ సక్సెస్-బీజేపీ నేతలకు సోము అభినందనలు-ఇకపై మనం చేయాల్సిందిదే..

ప్రధాని మోడీ విశాఖ టూర్ ప్రశాంతంగా ముగిసింది. బీజేపీతో పాటు వైసీపీ ప్రభుత్వం కూడా తలోచేయి వేయడంతో జన సమీకరణతో పాటు మరే ఇతర అంశంలోనూ ఎలాంటి సమస్యల్లేకుండా అంతా సజావుగా సాగిపోయింది. దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

వైజాగ్ లో ప్రధాని పర్యటన ముగిసిన తర్వాత నగరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఇందులో బీజేపీ ఉత్తరాంధ్ర నేతలతో ఆయన మాట్లాడారు. వారితో పలు కీలక విషయాల్ని చర్చించారు. ముందుగా ప్రధాని మోడీ టూర్ విజయవంతం చేసిన స్ధానిక బీజేపీ నేతల్ని సోము వీర్రాజు ప్రశంసించారు. ప్రధానమంత్రి రాక సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షో కార్యక్రమ ఇంఛార్జులు, వివిధ విభాగాల బాధ్యులను సోము అభినందించారు.

 somu veerraju praise bjp leaders on pm modi tour success in vizag, announced future plan

అనంతరం ప్రధాని మోడీ టూర్ విజయవంతం చేయడానికి స్థానిక నాయకత్వం శ్రమించిన తీరు అభినందనీయం అని సోము వీర్రాజు ప్రశంసించారు. ప్రధానితో జరిగిన కార్యక్రమంలో జరిగిన చర్చ , రాజకీయ అంశాలు ఆధారంగా భవిష్యత్తులో పార్టీ ప్రగతిపై నేతలతో సోము వీర్రాజు సమీక్షించారు. ప్రధాని ఇచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా భవిష్యత్తులో పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. ముఖ్యంగా రాష్ట్ర పార్టీ అభ్యర్థన ఏదైనా ప్రధాని, కేంద్ర కార్యాలయం నుండి త్వరితగతిన స్పందన లభిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని పార్టీ అభివృద్ధికి ఎలా వినియోగించుకోవాలి, మన సామర్ధ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి వంటి అంశాలపై నేతలతో సోము చర్చించారు. ఈ మేరకు రెండు రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం అయినట్లు బీజేపీ రాష్ట్ర శాఖ ప్రకటించింది.

 somu veerraju praise bjp leaders on pm modi tour success in vizag, announced future plan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+