వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుడేం చేశావ్: ఉండవల్లిపై నిప్పులు చెరిగిన సోము వీర్రాజు

By Pratap
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్‌పై బిజెపి ఎమ్మెల్సి సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది తమ పార్టీయేనని ఆన అన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికే కేంద్రం రూ.4 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపింది కూడా బిజెపియేనే అని ఆయన గుర్తు చేశారు.

 ఆంధ్ర అభివృద్ధి గుర్తు రాలేదా

ఆంధ్ర అభివృద్ధి గుర్తు రాలేదా

పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర అభివృద్ధి గుర్తుకు రాలేదా అని సోము వీర్రాజు ఉండవల్లిని ప్రశ్నించారు. పార్లమెంటులో రాష్ట్రాన్ని విడదీసినప్పుడు అప్పుడు ఎంపీగా ఉన్న ఉండవల్లి ఏం చేశారని ఆయన అడిగారు.

Recommended Video

చంద్రబాబూ నువ్వు కాంగ్రెస్‌తో కలిశావ్ : పవన్ కళ్యాణ్ వల్లే !
 తెలంగాణకు భద్రాద్రి రాముడు వెళ్తుంటే...

తెలంగాణకు భద్రాద్రి రాముడు వెళ్తుంటే...

భద్రాద్రి రాముడు తెలంగాణకు వెళ్లినప్పుడు ఉండవల్లి ఎందకు ఏం చేయలేకపోయారని ఆయన అన్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత విశాఖ రైల్వే జోన్ కోసం బిజెపి ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు.

 మళ్లీ మోడీయే ప్రధాని

మళ్లీ మోడీయే ప్రధాని

ఉపాధి పథకం కొందరు అవినీతిపరులకు ఉపాధిగా మారిందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీయే ప్రధాని అవుతారని ఆయన అన్నారు.

 తుది నిర్ణయం మోడీదే...

తుది నిర్ణయం మోడీదే...

ముందస్తు ఎన్నికలపై నరేంద్ర మోడీదే తుది నిర్ణయమని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక, మద్యం మాఫియాలను అరికట్టలేకపోతోందని ఆయన విమర్శించారు.

English summary
BJP MLC Somu Veerraju retaliated ex MP Undavalli Arun Kumar comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X