చీప్ లిక్కర్ వ్యాఖలను సమర్ధించుకున్న సోము వీర్రాజు: కేటీఆర్ కు చురకలు; మరో కొత్త డిమాండ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభలో సోము వీర్రాజు తాము అధికారంలోకి వస్తే 50 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తామని చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. వైసీపీ నేతలు ఈ వ్యవహారంలో సోము వీర్రాజు ను టార్గెట్ చేస్తూ ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా అనర్హుడని, ఆయన సారాయి వీర్రాజు అని విమర్శలు గుప్పిస్తున్నారు. మందు పోసి ఓట్లు అడుక్కునే దుస్థితికి ఏపీ బీజేపీ దిగజారి పోయిందని విమర్శిస్తున్నారు. మంత్రి కేటీఆర్ సైతం సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై బిజెపి ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా మరోమారు తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సోము వీర్రాజు, తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని లెక్కలు చెప్పారు.

50 రూపాయలకు లిక్కర్ అమ్మితే ప్రతి పేద కుటుంబానికి జరిగే లాభమిదే
రాజమహేంద్రవరం లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన సోము వీర్రాజు 50 రూపాయలకు లిక్కర్ అమ్మితే ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రెండు లక్షల రూపాయలు మిగులుతాయని లెక్కలు చెప్పారు. తాను లిక్కర్ గురించి పేదవాడిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడానని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఆరు రూపాయల బాటిల్ ను రెండు వందల రూపాయలకు అమ్మడాన్ని తాను ప్రోత్సహించ లేనని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు తనను సారాయి వీర్రాజు అన్న వారు ఏం తాగుతారో తనకు తెలుసు అంటూ సోము వీర్రాజు తనపై వ్యాఖ్యలు చేసిన వారి పై సెటైర్లు వేశారు.

సారాయి వీర్రాజుని కాదు .. బియ్యం వీర్రాజుని, సిమెంట్ వీర్రాజుని
ఆ సమయంలో సారాయి వీర్రాజు కాదని బియ్యం వీర్రాజు నని, సిమెంట్ వీర్రాజు నని, కోడిగుడ్ల వీర్రాజు నని ఆయన చెప్పుకొచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలు ఏదో ఆషామాషీగా చేస్తున్న వ్యాఖ్యలు కాదని 2024లో బీజేపీ మేనిఫెస్టో లో తన వ్యాఖ్యలను పెడతామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఇక తనపై ట్వీట్ చేసిన కేటీఆర్ తండ్రి తెల్లవారుజామున మూడు గంటల వరకు ఏం చేస్తారో చెప్పాలని సోము వీర్రాజు ప్రశ్నించారు. బిజెపి ఏ విషయమైనా సమయం, సందర్భంతో మాట్లాడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం పేరుతో నిలువు దోపిడీ జరుగుతోందని, ఈ క్రమంలోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని పేర్కొన్నారు.

కేజీహెచ్ పేరు మార్చాలన్న సోము వీర్రాజు డిమాండ్
ఏపీ లో ఉన్న ప్రతి సమస్యకు బిజెపి దగ్గర పరిష్కారం ఉందని సోము వీర్రాజు వెల్లడించారు. ఇక ఇదే సమయంలో విశాఖలో కేజీహెచ్ ఆసుపత్రి పేరును వెంటనే మార్చాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. అసలు కింగ్ జార్జి ఎవరని ప్రశ్నించారు. ఇందులో కింగ్ ఎవరని జార్జి ఎవరని ఆయన ప్రశ్నించారు. వెంటనే ఈ పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు .మన కట్టడాలకు మన పేర్లు పెట్టుకోవాలని పేర్కొన్న ఆయన విశాఖలో కెజిహెచ్ ఆసుపత్రికి సర్దార్ గౌతు లచ్చన్న పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.

జిన్నాటవర్ పేరు మార్చాల్సిందే అన్న సోము వీర్రాజు
త్యాగశీలుర పేర్లు పెట్టాలని పేర్కొన్న సోము వీర్రాజు మన వాళ్ళ పేర్లు పెట్టుకుంటే ఆ పేర్లు పెట్టడం వెనుక ఉన్న చరిత్ర మన ప్రజలకు తెలుస్తుందని పేర్కొన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కుటుంబ పార్టీలకు పరిపాలించే అవకాశాన్ని ప్రజలు ఇవ్వకూడదని, సోము వీర్రాజు కుటుంబ రాజకీయాలతో నష్టం తప్ప లాభం ఏమీ జరగదని స్పష్టం చేశారు. గుంటూరులో జిన్నా టవర్ పేరు మార్చాల్సిందే అని సోము వీర్రాజు మరోమారు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ పేరు మార్చకపోతే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మారుస్తామని వెల్లడించారు. సర్ ఆర్ధర్ కాటన్ తో పాటుగా ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వీరన్న అనే ఇంజనీర్ ను స్మరించుకోవాలని సోము వీర్రాజు గుర్తుచేశారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications