వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబూ! హోదా అడిగారా?, జగన్ డైరెక్షన్ ఎందుకు?: ఏకేసిన సోము వీర్రాజు

|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: భారతీయ జనతా పార్టీ నేత సోము వీర్రాజు మరోసారి చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ భాగస్వామ్య సదస్సుకు వచ్చిన వారెవరైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని అడిగారా? అని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశ్నించారు.

హోదాతో సంబంధం లేదు

హోదాతో సంబంధం లేదు

ఈ సదస్సు ద్వారా రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 11 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని చెబుతున్నారని.. అంటే, ప్రత్యేక హోదాకూ, ఉద్యోగాలకు సంబంధం లేదని తేలిపోయిందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. మూడుసార్లు నిర్వహించిన ఈ సదస్సుల ద్వారా ఇప్పటికే 30లక్షల ఉద్యోగాలు వచ్చాయంటున్నారని చెప్పారు.

Recommended Video

BJP Leader Fires At TDP And Congress
హోదా ఎందుకు దండగ..

హోదా ఎందుకు దండగ..

ఏడాదికి రూ.3 వేల కోట్లు మాత్రమే వచ్చే ప్రత్యేక హోదా ఎందుకు? దండగ అని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఏపీకి పరిశ్రమలు రావడానికి మోడీ ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. అందుకే కియా లాంటి మోటార్ పరిశ్రమలు ఏపీకి వచ్చాయని తెలిపారు.

బాబు ముందు మాట్లాడగలను

బాబు ముందు మాట్లాడగలను

చంద్రబాబు ఎదుట నిలబడి వాస్తవాలు మాట్లాడగలనని సోము వీర్రాజు చెప్పారు. ఎందుకూ ఉపయోగపడని తన ఎమ్మెల్సీ పదవిని టీడీపీ నేతలు వాళ్ల భిక్ష అంటున్నారని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు.

అంతా మేమే చేశాం! బాబు-కేసీఆర్, ఉండవల్లి, సుజనాపై వీర్రాజు సంచలన వ్యాఖ్యలుఅంతా మేమే చేశాం! బాబు-కేసీఆర్, ఉండవల్లి, సుజనాపై వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

జగన్ పార్టీ డైరెక్షన్ అవసరమా?

జగన్ పార్టీ డైరెక్షన్ అవసరమా?

వాస్తవాలు మాట్లాడేందుకు తనకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ అవసరమా? అని నిలదీశారు. తమపై ఆరోపణలు ఎదుర్కొనేందుకు అస్త్రాలున్నాయని చెప్పారు.

జయదేవ్ కు సన్మానాలా?

జయదేవ్ కు సన్మానాలా?

పార్లమెంటులో 3నిమిషాలు రాసిచ్చిన స్క్రిప్టు చదివితే.. ఎంపీ గల్లా జయదేవ్‌కు సన్మానాలా? అని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. హోదా పేరుతో కమ్యూనిస్టు నాయకులు ఫ్రీగా ప్రచారం పొందుతున్నారని అన్నారు.

English summary
BJP leasder Somu Veerraju targes Chandrababu Naidu's government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X