సవతి తల్లితో కొడుకు అక్రమ సంబంధం...ఆపై అనుమానంతో హత్య
నెల్లూరు:కామంతో కళ్లు మూసుకుపోయి వావివరసలు మరచి తన సవతి తల్లితోనే అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ కొడుకు ఆ తరువాత ఆమె వేరొకరితో తిరుగుతుందనే అనుమానంతో దారుణంగా హతమార్చాడు. మానవ సంబంధాలను అపవిత్ర పరుస్తూ సభ్య సమాజం నివ్వెరపోయేలా జరిగిన ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...
నెల్లూరు జిల్లా అడవిపూడి గ్రామానికి చెందిన సత్యనారాయణకు భానుమతి అనే మహిళతో వివాహమైంది. వీరికి ఐదుగురు సంతానం. ఆ తరువాత భానుమతి అనారోగ్యంతో చనిపోయింది. దీంతో సత్యానారాయణ రాజేశ్వరి అనే మరో మహిళను రెండవ పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం కలిగారు. రాజేశ్వరి విజయవాడలోని ఒక ఆశ్రమంలో పని దొరకడంతో అక్రడే ఉండి పని చేస్తూ వారంలో రెండు మూడు రోజులు నెల్లూరు వస్తోంది. ఈక్రమంలో సత్యనారాయణ మొదటి భార్య సంతానంలో రెండో కుమారుడైన కుమార్ రాజాకు తన సవతి తల్లితో అక్రమ సంబంధం ఏర్పడింది.

అలా ఆరు నెలల పాటు వీరి మధ్య ఆ వివాహేతర సంబంధం కొనసాగింది. అయితే పని మీద తరుచూ విజయవాడకు వెళ్ళి వస్తున్న పిన్ని రాజేశ్వరిపై కుమార్ రాజాకు అనుమానం కలిగింది. ఆమె విజయవాడలో మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగివుందని కుమార్ రాజ అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఎప్పటికైనా ఆమె తనకు దూరమవుతుందని భావించాడు. అందుకే ఆమెని చంపి పగ తీర్చుకోవాలనుకున్నాడు.
ఆ తరువాత ఒక పథకం ప్రకారం ఆమెకు ఫుల్లుగా మద్యం తాగించి ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళాడు. అక్కడ ముందుగా ఆమెతో కోరిక తీర్చుకొని ఆ తరువాత తలపై బండరాయితో కొట్టి చంపేశాడు. ఆమె శవం కనిపించకుండా అదే ప్రాంతంలో పిన్ని రాజేశ్వరి శవాన్ని పూడ్చేశాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్లుగా ఇంటికి వచ్చాడు. తరువాత పిన్ని కనబడటం లేదంటూ తానే పోలీస్ స్టేషనుకు వెళ్లి మరీ ఫిర్యాదు కూడా ఇచ్చాడు.
పోలీసులు ఆమె కోసం మూడురోజులు వెతికాక అనుమానం వచ్చి కుటుంబ సభ్యులను గట్టిగా ప్రశ్నించారు. దీంతో వీరి వ్యవహారం బైటపడింది. ఆ తరువాత కుమార్ రాజాను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి అసలు విషయం బైటపడింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శవాన్ని తవ్వించి పోస్టుమార్టంకు తరలించనున్నారు.












Click it and Unblock the Notifications