దారుణం: చికెన్ తేలేదని తండ్రిని రోకలి బండతో కొట్టి చంపిన తనయుడు

అమరావతి: మానవ సంబంధాలు మరితంగా దిగజారి పోతున్నాయని అనడానికి ఇదే నిదర్శనం. చిన్న పాటి గొడవలకే ప్రాణాలు తీసుకునే స్థాయికి మనుషులు దిగజారి పోతున్నారు. ఆదివారం నాడు చికెన్ తీసుకురాలేదని తండ్రితో గొడవపడ్డ కుమారుడు ఆవేశంలో తండ్రినే హతమార్చాడు.

వివరాల్లోకి వెళితే... కడప జిల్లాలోని రాజంపేట మండలం గుళ్లూరులో చోటు చేసుకుంది ఈ దారుణ సంఘటన. ఆదివారం చికెన్ తీసుకుని రాలేదని తన తండ్రి ఎల్లయ్యతో గొడవ పడ్డాడు అతని కుమారుడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవ మరితంగా పెరగడంతో ఆవేశంతో అందుబాటులో ఉన్న రోకలి బండతో ఎల్లయ్యను చితకబాదాడు.

దీంతో తీవ్రంగా గాయపడిన ఎల్లయ్యను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎల్లయ్య సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడైన ఎల్లయ్య కుమారుడిని అరెస్ట్ చేశారు.

 Son attacked on father not bringing chicken on sunday

వివాహేతర సంబంధం: మహిళపై యాసిడ్ దాడి

వివాహేతర సంబంధం ఒక మహిళపై యాసిడ్ దాడికి దారితీసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజు(25)కు స్థానిక వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాల కారణంగా గత కొన్నిరోజులుగా ఇద్దరూ మాట్లాడుకోవడం లేదు.

ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం అతడు సదరు మహిళ ఇంటికి వెళ్లి ఆమెపై యాసిడ్ పోశాడు. బాధితురాలు కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని రాజును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలికి స్వల్పంగా గాయాలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+