ప్రేమ వ్యవహారానికి అడ్డొస్తుందని కన్నతల్లిని చంపిన కిరాతకుడు

హైదరాబాద్: విశాఖపట్నం నగరంలోని గాజువాకలో దారుణం జరిగింది. తన ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని కన్నతల్లినే హత్య చేశాడు ఓ కిరాతక కొడుకు. తన ప్రేమ వ్యవహారానికి అడ్డు వస్తోందని అతను తల్లిని హత్య చేశాడని చెబుతున్నారు. ఈ సంఘటన మూడు రోజుల క్రితం జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సంఘటన గాజువాక అశోక్ నగర్‌లో జరిగింది. తల్లిని చంపిన అతను మృతదేహాన్ని ఇంట్లోనే పాతి పెట్టాడు. దానిని పోలీసులు గుర్తించారు. కాగా, హత్యకు ఆర్థిక వ్యవహారాలు కూడా ఓ కారణం కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

పట్టపగలే చోరీ, భారీగా సొత్త అపహరణ

Son kills mother in Vishaka

హైదరాబాద్ నగరంలోని జవహర్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఆదివారం పట్టపగలే చోరీ జరిగింది. దమ్మాయిగూడలో ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు 40 తులాల బంగారం, వెయ్యి అమెరికా డాలర్లు, రూ.30 వేల నగదు ఎత్తుకెళ్లారు.

నిజామాబాద్ జిల్లాలో సైకిల్‌ దొంగ మృతి కేసులో ఇద్దరు పోలీసులు సస్పెండ్‌ అయ్యారు. నిజామాబాద్‌ 1 టౌన్‌ ఎస్సై శ్రీనివాస్‌, కానిస్టేబుల్‌ శ్రీరామ్‌ను హైదర్‌ లాకప్‌డెత్‌ కేసులో ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

బైక్ బోల్తా, ఇద్దరు మృతి

అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం బంగారంపేట వద్ద ద్విచక్ర వాహనం బోల్తా పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయాలు అయిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి దరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+