హైదరాబాద్ నుంచి కాకినాడ,నర్సాపూర్ మధ్య ప్రయాణికులకు గుడ్ న్యూస్..!

హైదరాబాద్ నుంచి ఏపీలోని కాకినాడ, నర్సాపూర్ కు, అలాగే ఈ మార్గాల్లో వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వారాంతాల్లో పెరుగుతున్న ప్రయాణికుల రద్దని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్ లోని చర్లపల్లి స్టేషన్ నుంచి కాకినాడ టౌన్ స్టేషన్ కూ, అలాగే చర్లపల్లి స్టేషన్ నుంచి నర్సాపూర్ స్టేషన్ కు మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపబోతోంది. ఇవి ఏయే తేదీల్లో నడుస్తాయన్న సమాచారంతో పాటు ఇతర వివరాలను రైల్వే విడుదల చేసింది.

ఈ నెల 14, 21 తేదీల్లో చర్లపల్లి స్టేషన్ నుంచి సాయంత్రం 7.20కి బయలుదేరనున్న ప్రత్యేక ఎక్స్ ప్రెస్ (07031) రైలు కాకినాడ టౌన్ స్టేషన్ కు తర్వాతి రోజు ఉదయం 4.30కు చేరుకోనుంది. అలాగే ఈ నెల 16, 23 తేదీల్లో కాకినాడ నుంచి సాయంత్రం 6.55కి బయలుదేరే ప్రత్యేక రైళ్లు (07032) మరుసటి రోజు ఉదయం 6.50కి చర్లపల్లి స్టేషన్ కు చేరుకోనున్నాయి. ఈ రైళ్లకు నల్లొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో హాల్ట్ ఇచ్చారు. వీటిలో సెకండ్, ధర్డ్ ఏసీ స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.

south central railway announced special weekend trains from charlapalli to Kakinada and narsapur

అలాగే ఈ నెల 14, 21 తేదీల్లో చర్లపల్లిలో సాయంత్రం 7.15కు బయలుదేరే (07233) ప్రత్యేక రైళ్లు .. తర్వాతి రోజు ఉదయం 5.50కి నర్సాపూర్ చేరుకుంటాయి. అలాగే ఈ నెల 16, 23 తేదీల్లో నర్సాపూర్ నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైళ్లు (07234)తర్వాతి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకోనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లకు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు స్టేషన్లలో హాల్ట్ లు ఇచ్చారు. వీటిలో సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+