హైదరాబాద్, తిరుపతి, అనకాపల్లి ప్రయాణికులకు గుడ్ న్యూస్...!
తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఇవాళ మరోసారి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో తెలంగాణలోని హైదరాబాద్, ఏపీలోని అనకాపల్లి, తిరుపతి, మహారాష్ట్రలోని నాందేడ్, ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ల మధ్య ఇవి రాకపోకలు సాగించబోతున్నాయి. కాబట్టి ఈ పండుగ సీజన్లో ప్రయాణికులు ఆయా రైళ్ల సమయాలను బట్టి ప్రయాణాలు ప్రాన్ చేసుకోవచ్చు.
ముందుగా నాందేడ్ నుంచి అనకాపల్లికి రైలు నంబర్ 07037 ప్రత్యేక రైలు ఈ నెల 14 నుంచి వచ్చే నెల 25 వరకూ ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది. అలాగే అనకాపల్లి నుంచి నాందేడ్ కు మరో ప్రత్యేక రైలు నంబర్ 07038 ఈ నెల 15 నుంచి వచ్చే నెల 26వరకూ ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుంది. ఇలా మొత్తం 14 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండబోతున్నాయి.

ఈ ప్రత్యేక రైళ్లు ముద్‌ఖేడ్, ధర్మాబాద్, బాసర్, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడే, పిడుగురాళ్ల, సత్తెనపల్లె, గుంటూరు,విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచల్లి స్టేషన్లలో ఇరువైపులా ఆగుతాయి.

వీటితో పాటు హైదరాబాద్ నుంచి హజరత్ నిజాముద్దీన్ కు ఈనెల 13న మంగళవారం 07070 నంబర్ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు తిరుపతి నుంచి హజరత్ నిజాముద్దీన్ కు ఈ నెల 12న(ఆదివారం) 07071 నంబర్ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. అలాగే నాందేడ్ నుంచి కూడా హజరత్ నిజాముద్దీన్ కు మరో ప్రత్యేక రైలు 07699 ఈ నెల 12న అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రయాణికులు వీటికి ఆన్ లైన్, ఆఫ్ లైన్లలో టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణాలు సాగించవచ్చు.












Click it and Unblock the Notifications