విశాఖ, కాకినాడ, నరసాపురం, చర్లపల్లి, వికారాబాద్ ప్రయాణికులకు రైల్వే అలర్ట్..!

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పండుగలు, కొత్త ఏడాది సందర్భంగా రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. దీంతో ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెస్తున్న అధికారులు.. అలాగే పలు రైళ్ల సమయాల్లోనూ మార్పులు చేర్పులు చేస్తున్నారు. అలాగే కొన్ని రైళ్లను ఇతర రైళ్ల కోసం రద్దు చేస్తున్నారు. ఇలాంటిదే మరో నిర్ణయం ఇవాళ తీసుకున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే పలు రైళ్లపై ప్రభావం పడుతోంది.

తెలంగాణలోని చర్లపల్లి, వికారాబాద్, ఏపీ లోని నరసాపురం, కాకినాడ మధ్య రాకపోకలు సాగిస్తున్న పలు రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఇందులో ఈ నెల 13న నరసాపురం నుంచి చర్లపల్లికి వెళ్లాల్సిన రైలు నంబర్ 07254 రద్దయింది. అలాగే ఈ నెల 17న చర్లపల్లి నుంచి నరసాపురానికి వెళ్లాల్సిన రైలు నంబర్ 07233 కూడా రద్దు చేశారు. వీటితో పాటు ఈ నెల 19న వికారాబాద్ నుంచి నరసాపురానికి వెళ్లాల్సిన రైలు నంబర్ 07260 కూడా రద్దయింది.

south central railway big update on Kakinada narasapur charlapalli vikarabad vizag trains

ఈ నెల 19న వికారాబాద్ నుంచి కాకినాడకు వెళ్లాల్సిన రైలు నంబర్ 07287 కూడా రద్దయింది. దీంతో పాటు ఈ నెల 20న వికారాబాద్ నుంచి నరసాపురానికి వెళ్లాల్సిన రైలు నంబర్ 07266, అదే రోజు వికారాబాద్ నుంచి కాకినాడ టౌన్ కు వెళ్లాల్సిన రైలు నంబర్ 07286 కూడా రద్దయ్యాయి. దీంతో ఆయా స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.

south central railway big update on Kakinada narasapur charlapalli vikarabad vizag trains

మరోవైపు విశాఖ నుంచి చర్లపల్లికి ఈ నెల 18న ప్రత్యేక రైలు ప్రకటించారు. ఈ రైలు విశాఖలో రాత్రి 11 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30కి చర్లపల్లి చేరుతుంది. దీంతో పాటు చర్లపల్లి నుంచి విశాఖకు మరో ప్రత్యేక రైలు ఈ నెల 19న నడుపుతున్నారు. ఇది చర్లపల్లిలో మధ్యాహ్నం 3.30కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విశాఖ చేరుతుంది.
ఈ రెండు రైళ్లకు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండలో హాల్ట్ లు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+