దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 20 రైళ్ల రద్దు, 22 దారి మళ్లింపు- కారణం ఇదే..!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో జరుగుతున్న మరమ్మత్తు పనుల కారణంగా భారీగా రైళ్లు రద్దు కాబోతున్నాయి. అలాగే పలు రైళ్లను దారి మళ్లిస్తున్నారు. వీటి వివరాలను ఇవాళ అధికారులు విడుదల చేసారు. ఇందులో తిరుపతి, గుంతకల్, బెంగళూరు, ధర్మవరం, మహారాష్ట్రలోని లాతూర్, నాసిక్ వంటి స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే రైళ్లు ఉన్నాయి. ఇవి ఏయే తేదీల్లో రద్దయ్యాయో, దారి మళ్లింపు జరిగాయో తెలుసుకుని ప్రయాణికులు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
తిరుపతి-గుంతకల్ మధ్య రాకపోకలు సాగించే అన్ని రైళ్లు రేపటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకూ రద్దయ్యాయి. అలాగే తిరుపతి-కదిరిదేవరపల్లి మధ్య రాకపోకలు సాగించే అన్ని రైళ్లు రేపటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకూ రద్దయ్యాయి. బెంగళూరు- ధర్మవరం మధ్య నడిచే అన్ని రైళ్లు మే 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ రద్దు కానున్నాయి. గుంతకల్-హిందూపూర్ మధ్య మే 4వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ నడిచే రైళ్లు రద్దయ్యాయి.

తిరుపతి-అమరావతి మధ్య నడిచే రైళ్లు మే 5, 6, 8, 10, 12, 13, 15, 17 తేదీల్లో రద్దయ్యాయి. యశ్వంత్ పూర్-బీదర్ మధ్య మే 12 నుంచి 16వ తేదీ మధ్య పలు సర్వీసులు రద్దయ్యాయి. అలాగే యశ్వంత్ పూర్-లాతూర్ మధ్య మే 14, 17 తేదీల మధ్య నడిచే పలు సర్వీసులు రద్దయ్యాయి. అలాగే సోలాపూర్-హసన్ మధ్య మే 11నుంచి 17వ తేదీ మధ్య పలు రైళ్లు రద్దయ్యాయి. అలాగే రేపటి నుంచి మే 17 వరకూ నరసాపురం-ధర్మవరం మధ్య నడిచే రైళ్లు రద్దయ్యాయి. మచిలీపట్నం -ధర్మవరం మధ్య మే 1 నుంచి 17వ తేదీ వరకూ నడిచే రైళ్లు రద్దయ్యాయి.
మరోవైపు ముంబై- త్రివేండ్రం, తిరుపతి-అకోలా, సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ-మధురై, ముంబై-నాగర్ సోల్, హుబ్బళ్లి-మైసూర్, యశ్వంత్ పూర్-గోరఖ్ పూర్, హౌరా-యశ్వంత్ పూర్, బెంగళూరు-అజ్మీర్, భగత్ కీ కోటీ-బెంగళూరు, షిర్డీ సాయినగర్-చెన్నై సెంట్రల్, త్రివేండ్రం-ముంబై మధ్య నడిచే రైళ్లను మే 4 నుంచి 17వ తేదీ వరకూ దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.












Click it and Unblock the Notifications