లింగంపల్లి, గుంటూరు, విశాఖ రైలు ప్రయాణికులకు అలర్ట్..!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని లింగంపల్లి, గుంటూరు, విశాఖ స్టేషన్లు, వాటి మధ్య ఉన్న స్టేషన్లకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు అలర్ట్ జారీ చేశారు. రైల్వే మరమ్మత్తు పనుల కారణంగా ఈ స్టేషన్ల పరిధిలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇలా ఏయే రైళ్లు, ఏయే తేదీల్లో రద్దయ్యాయో వివరాలను వెల్లడించారు. వీటిని ప్రయాణికులు గమనించాలని కోరుతున్నారు.
గుంటూరు-విశాఖ మధ్య నడిచే 17239 నంబర్ రైలును మార్చి1, 2 తేదీల్లో రద్దు చేశారు. అలాగే విశాఖపట్నం- గుంటూరు మధ్య నడిచే రైలు నంబర్ 17240ను మార్చి 2, 3 తేదీల్లో రద్దు చేశారు. విశాఖపట్నం-లింగంపల్లి మధ్య నడిచే రైలు నంబర్ 12805 ను మార్చి 2వ తేదీన రద్దు చేశారు. అలాగే లింగంపల్లి నుంచి విశాఖకు నడిచే రైలు నంబర్ 12806ను మార్చి 3న రద్దు చేశారు. కాబట్టి ఈ స్టేషన్లతో పాటు వాటి మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.

విజయవాడ డివిజన్‌లోని కడియం -ద్వారపూడి -అనపర్తి మధ్య ఆటోమేటిక్ సెక్షన్‌ను ప్రారంభించడం కోసం నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో ఆయా సెక్షన్లలో పనులు పూర్తి కాగానే అంటే మార్చి నాలుగో తేదీ నుంచి ఆయా రైళ్లు యథావిథిగా రాకపోకలు సాగించబోతున్నాయి. పనులు ఆలస్యమైతే మాత్రం మరోసారి రైల్వే అధికారులు అలర్ట్ ప్రకటిస్తారు.












Click it and Unblock the Notifications