రాజమండ్రి, కాకినాడ, విశాఖ ప్రయాణికులకు రైల్వే అలర్ట్..!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 20న ఈ మూడు స్టేషన్ల మధ్య నడిచే నాలుగు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. విజయవాడ-దువ్వాడ సెక్షన్ లో జరుగుతున్న పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి ఈ మూడు స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే వారు ఈ విషయం గమనించాల్సి ఉంటుంది.
విజయవాడ-దువ్వాడ సెక్షన్ లోని తుని, హంసవరం, అన్నవరం, రావికంపాడు స్టేషన్లలో ఆటోమేటిక్ సెక్షన్ ఏర్పాటు చేస్తున్నందున నాన్-ఇంటర్ లాకింగ్ పనులు చేపడుతున్నారు. దీని వల్ల ఈ నెల 20వ తేదీన కాకినాడ-విశాఖ, రాజమండ్రి-విశాఖ మధ్య ప్రయాణించే నాలుగు రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఇందులో కాకినాడ పోర్టు నుంచి విశాఖపట్నం వెళ్లే రైలు నంబర్ 17267 మెమూ ఎక్స్ ప్రెస్, అలాగే విశాఖ నుంచి కాకినాడకు ప్రయాణించే రైలు నంబర్ 17268 కూడా ఉంది.

అలాగే రాజమండ్రి నుంచి విశాఖపట్నానికి వెళ్లే రైలు నంబర్ 67285 మెమూ ఎక్స్ ప్రెస్, దీంతో పాటు విశాఖపట్నం నుంచి తిరిగి రాజమండ్రికి వచ్చే రైలు నంబర్ 67286 మెమూ ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా ఈ నెల 20న రద్దు చేశారు. కాబట్టి 20వ తేదీన ప్రయాణాలు చేసే వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. 21వ తేదీ నుంచి ఈ నాలుగు రైళ్లు ఆయా స్టేషన్ల మధ్య యథావిధిగా రాకపోకలు సాగిస్తాయని అధికారులు తెలిపారు. మిగతా రైళ్ల రాకపోకల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.












Click it and Unblock the Notifications