అనకాపల్లి, తిరుపతి ప్రయాణికులకు రైల్వే బిగ్ అలర్ట్..!
అనకాపల్లి నుంచి తిరుపతికి, అలాగే తిరుపతి నుంచి అనకాపల్లికి ప్రయాణాలు చేసే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే బిగ్ అలర్ట్ ఇచ్చింది. వివిధ తేదీల్లో ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసింది. సాంకేతిక కారణాలతో ఆయా రైళ్ల రాకపోకల్ని రద్దు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాబట్టి తిరుపతి-అనకాపల్లి మధ్య రాకపోకలు సాగించే వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.
తిరుపతి నుంచి అనకాపల్లికి ప్రతీ ఆదివారం నడిచే రైలు నంబర్ 07481ను ఈ నెల 9, 11, 23, 30 తేదీల్లో రద్దు చేశారు. అలాగే అనకాపల్లి నుంచి తిరుపతికి ప్రతీ సోమవారం వెళ్లే రైలు నంబర్ 07482ను కూడా ఈ నెల 10, 17, 24, డిసెంబర్ 1 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. ఈ సెక్షన్లో సాంకేతిక పరమైన కారణాల వల్ల ఈ రెండు రైళ్లను ఈ నెల 9 నుంచి డిసెంబర్ 1 వరకూ రద్దు చేసినట్లయింది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాల్సి ఉంటుంది.

ఇప్పటికే అనకాపల్లి, తిరుపతి మధ్య రాకపోకలు సాగించే పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత నెలలోనూ ఈ రెండు స్టేషన్ల మధ్య పలు రైళ్లు రద్దవుతూ వస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఈ మార్పులు తెలియక ఇబ్బందులు పడుతున్న సందర్భాలు కూడా కనిపించాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరోసారి అనకాపల్లి, తిరుపతి స్టేషన్ల మధ్య నడిచే ఈ రెండు రైళ్లను రద్దు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే నెల నుంచి ఈ రైళ్లు యథావిథిగా రాకపోకలు సాగించనున్నాయి.












Click it and Unblock the Notifications