కాకినాడ, నరసాపురం టూ కర్నాటక ప్రయాణికులకు రైల్వే అలర్ట్..!

దక్షిణ మధ్య రైల్వే (south central railway) పరిధిలో పండుగల రద్దీ ముగిసినా ప్రయాణికుల రద్దీ మాత్రం కొనసాగుతోంది. దీంతో ఇప్పటికే నడుపుతున్న పలు ప్రత్యేక రైళ్లకు మరికొంత కాలం పాటు పొడిగింపులు ఇస్తున్నారు. ఇదే క్రమంలో మన రాష్ట్రంలోని కాకినాడ, నరసాపురం నుంచి కర్నాటకలోని వివిధ ప్రాంతాలకు నడుపుతున్న ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

ప్రతీ సోమవారం, శుక్రవారం కాకినాడ టౌన్ నుంచి మైసూరుకు నడుపుతున్న ప్రత్యేక రైలు (నంబర్ 070333)ను మార్చి 2 నుంచి మార్చి 30 వరకూ పొడిగించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ లెక్కన 9 సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. అలాగే మైసూరు నుంచి కాకినాడ టౌన్ కు ప్రతీ మంగళవారం, శనివారాల్లో నడుపుతున్నప్రత్యేక రైలు (నంబర్ 07034)ను మార్చి 3 నుంచి 31వ తేదీ వరకూ పొడిగించాలని నిర్ణయించింది. ఈ లెక్కన మరో 9 సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి.

south central railway extends special trains between kakinada-mysore narasapur-bengaluru

అలాగే కాకినాడ-మైసూరు మధ్య నడుపుతున్న ప్రత్యేక రైళ్లకు సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడే, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, మంత్రాలయం రోడ్‌, ఆదోని, గుంతకల్‌, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్‌, యలహంక, బెంగళూరు కాంట్‌, కెఎస్‌ఆర్‌ బెంగళూరు, కెంగేరి, మాండ్య స్టేషన్లలో హాల్ట్ లు ఇచ్చారు. ఈ ప్రత్యేక రైళ్లలో 1AC, 2AC, 3AC, స్లీపర్ క్లాస్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

అలాగే నరసాపురం నుంచి ఎస్ఎంవీటీ బెంగళూరు స్టేషన్ కు ప్రతీ శుక్రవారం నడుపుతున్న ప్రత్యేక రైలు (నంబర్ 07153)ను మార్చి 6 నుంచి 27వ తేదీ వరకూ పొడిగించారు. ఈ లెక్కన మరో 4 సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. అలాగే ఎస్ఎంవీటీ బెంగళూరు స్టేషన్ నుంచి నరసాపురానికి ప్రతీ శనివారం నడుపుతున్న ప్రత్యేక రైలు (నంబర్ 07154)ను మార్చి 7 నుంచి 28వ తేదీ వరకూ పొడిగించారు. ఈ లెక్కన మరో నాలుగు రైళ్లు అందుబాటులోకి వస్తాయి.

south central railway extends special trains between kakinada-mysore narasapur-bengaluru

ఈ ప్రత్యేక రైళ్లకు పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, కృష్ణాపురం స్టేషన్లలో హాల్ట్ లు ఇచ్చారు. ఈ ప్రత్యేక రైళ్లలో AC II టైర్, AC III టైర్, స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+