నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
ఏపీలోని నరసాపురం నుంచి కర్నాటకలోని బెంగళూరు, అలాగే తమిళనాడులోని తిరువణ్ణామలై వెళ్లే ప్రయాణికులకు, అలాగే తిరుగు ప్రయాణాలు చేసే వారికి దక్షిణ మధ్య రైల్వే (south central railway) ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా వేసవిలో రైళ్ల రద్దీతో ఈ మార్గాల్లో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఇది ఊరట కలిగించనుంది. ఈ మార్గాల్లో నడుపుతున్న ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.
వేసవి రద్దీ నేపథ్యంలో నరసాపురం నుంచి ప్రస్తుతం అరుణాచలం, బెంగళూరు మధ్య నడుపుతున్న మొత్తం నాలుగు రైళ్లను పొడిగించారు. ఇందులో నరసాపురం-తిరువణ్ణామలై ప్రత్యేక రైలు నంబర్ 07219ను ఏప్రిల్ 8 నుంచి మే 27 వరకూ పొడిగించారు. అలాగే తిరువణ్ణామలై నుంచి నరసాపురానికి నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 07220ను ఏప్రిల్ 9 నుంచి మే 28 వరకూ పొడిగించారు. అలాగే నరసాపురం నుంచి ఎస్ఎంవీటీ బెంగళూరుకు నడుపుతున్న ప్రత్యేక రైలును ఏప్రిల్ 10 నుంచి మే 29 వరకూ పొడిగించారు. దీంతో పాటు ఎస్ఎంవీటీ బెంగళూరు-నరసాపురం ప్రత్యేక రైలు నంబర్ 07154ను సైతం ఏప్రిల్ 11 నుంచి మే 30 వరకూ పొడిగించారు.

అరుణాచలం ప్రత్యేక రైళ్లకు పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పడి, వెల్లూరు స్టేషన్లలో స్టాప్ లు ఇచ్చారు. అలాగే బెంగళూరు రైళ్లకు పాలకొల్లు, వీరవాసరం, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు రేణిగుంట, కాట్పడి, జోలార్పెట్టై, బంగార్పేట, కృష్ణరాజపురంలో స్టాప్ లు ఇచ్చారు.












Click it and Unblock the Notifications