ఏపీ ప్రజలకు శుభవార్త వినిపించిన షిరిడీ సాయిబాబా

షిరిడీ సాయిబాబా దర్శనానికి వెళ్లాలనుకునే ప్రకాశం, రాయలసీమ జిల్లాల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను వినిపించింది. ప్రస్తుతం 17253 నెంబరుతో ప్రతిరోజు గుంటూరు నుంచి సికింద్రాబాద్, 17254 నెంబరుతో సికింద్రాబాద్ నుంచి గుంటూరు వరకు ఓ రైలు నడుస్తోంది. దీన్ని మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వరకు పొడిగించారు. షిరిడీ వెళ్లాలనుకునేవారు ఔరంగాబాద్ వరకు వెళ్లి అక్కడి నుంచి వెళ్లొచ్చు. అక్కడినుంచి షిరిడీకి కేవలం 122 కిలోమీటర్లే దూరం. ప్రస్తుతం భక్తులు నాగర్ సోల్ వరకు వెళ్లి అక్కడి నుంచి వ్యాన్లలో షిరిడీ వెళుతున్నారు. అలాగే ఔరంగాబాద్ నుంచి కూడా వెళ్లడానికి ఇప్పుడు అవకాశం దొరికింది.

అందరికీ అందుబాటులో..
ప్రతిరోజు గుంటూరులో ఉదయం 7.10 గంటలకు బయలుదేరి తర్వాతరోజు మధ్యాహ్నం 1.20 గంటలకు ఔరంగాబాద్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఔరంగాబాద్‌లో సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరి తర్వాతరోజు రాత్రి 9.30 గంటలకు గుంటూరు చేరుకుంటుంది.

south central railway runs daily trains from guntur to aurangabad

గుంటూరు, పేరేచర్ల, నరసరావుపేట, వినుకొండ, కురిచేడు, దొనకొండ, మార్కాపురం రోడ్డు, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, గాజులపల్లి, నంద్యాల, కృష్ణమ కోన, బేతంచర్ల, రంగాపురం, డోన్, బోగోలు,వెల్దుర్తి, ఉలిందికొండ, దూపుడు, కోట్ల, కర్నూలు టౌన్‌, అలంపూర్, జోగులాంబ, గద్వాల, దేవరకద్ర, మహబూబ్ నగర్, వనపర్తి, షాద్ నగర్, కాచిగూడ స్టేషన్లలో ఆగుతుంది.

south central railway runs daily trains from guntur to aurangabad

భవిష్యత్తులో వీలును బట్టి..
భవిష్యత్తులో అందుబాటులో ఉండే రైళ్లను పరిశీలించుకొని నేరుగా షిరిడీ వరకు నడిపే అవకాశాన్ని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ రైలు వల్ల షిరిడీతో పాటు నాసికి, ఔరంగాబాద్, పర్బణి తదితర ప్రాంతాలకు వెళ్లేవారికి సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. రోజురోజుకు రైలు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని, వారి అవసరాలకు అనుగుణంగా రైళ్లను తిప్పుతున్నామని, గుంటూరు నుంచి రద్దీ పెరుగుతుండటంతో అదనపు రైళ్ల కోసం రైల్వేబోర్డుకు లేఖ రాసినట్లు గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+