విశాఖ-చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే అలర్ట్..! రేపు, ఎల్లుండి..!
ఏపీలోని విశాఖపట్నం నుంచి హైదరాబాద్ లోని చర్లపల్లికి రాకపోకలు సాగించే వీకెండ్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (south central railway) ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రెండు స్టేషన్ల మధ్య ఆదివారం, సోమవారం రెండు ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. వీకెండ్ లో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు వీలుగా ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాలను రైల్వే విడుదల చేసింది.
ఇందులో విశాఖపట్నం నుంచి చర్లపల్లికి రేపు (ఆదివారం) సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు నంబర్ 08517 ఎల్లుండి(సోమవారం) ఉదయం 8.15కు గమ్యానికి చేరుతుంది. అలాగే చర్లపల్లి నుంచి విశాఖపట్నానికి ఎల్లుండి (సోమవారం) మధ్యాహ్నం 3.30 గంటలకు మరో ప్రత్యేక రైలు నంబర్ 08518 బయలుదేరి తర్వాత రోజు (మంగళవారం) ఉదయం 7 గంటలకు గమ్యానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

ఈ రెండు ప్రత్యేక రైళ్లకూ దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో హాల్ట్ లు ఇచ్చారు. అలాగే ఈ రెండు ప్రత్యేక రైళ్లలోనూ ధర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, జనరల్ సెకండ్ క్లాస్ బోగీల్ని అందుబాటులో ఉంచారు. కాబట్టి రిపబ్లిక్ డేకు ముందు విశాఖపట్నం-చర్లపల్లి మధ్య ప్రయాణాలు చేసే వారు ఈ రైళ్లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు.
-
ఐఆర్సీటీసీలో 3 కోట్ల ఫేక్ ఖాతాల తొలగింపు.. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications