Special Trains: దసరాకు ప్రత్యేక రైళ్లు.. ఎక్కడి నుంచి ఎక్కడికంటే..!
దసరా, బతుకమ్మ పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి భారీగా జనం ఊళ్లకు వెళ్తారు. ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. కాచిగూడ-కాకినాడ టౌన్ మధ్య ఈ ప్రత్యేక రైళ్ల నడవనున్నాయి. ఈ నెల 19, 26 తేదీల్లో కాచిగూడ నుంచి ప్రత్యేక రైలు(07653) రాత్రి 8.30 గంటలకు బయల్దేరుతాయి. తర్వాత రోజు ఉదయం 8 గంటలకు కాకినాడకు చేరుకుంటాయి. తిరిగి ఈ నెల 20, 27 తేదీల్లో కాకినాడ పట్టణం నుంచి ప్రత్యేక రైలు(07654) సాయంత్రం 5.10 గంటలకు బయల్దేరుతుంది. 21, 28 తేదీల్లో తెల్లవారుజామున 4.50 గంటలకు కాచిగూడకు చేరుకుంటాయి.
ఈ రైళ్లు మల్కాజిగిరి, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వివరించారు. దసరా సెలవుల సందర్భంగా నైరుతి రైల్వే జోన్‌కు చెందిన బెంగళూరు డివిజన్
ప్రత్యేక రైళ్లను నడపనున్నాయి. మైసూరు - బెంగళూరుల మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నాయి. ఈ మేరకు డివిజన్ ఉన్నతాధికారి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అన్‌రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లు మైసూరు - బెంగళూరుల మధ్య ఐదు ట్రిప్‌లు నడవనున్నాయి. ఈ రైలు సేవలు ఈనెల 20 నుంచి 24వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు మైసూరులో రాత్రి 11.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 2.30గంటలకు బెంగళూరుకు చేరుకోనుంది. మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు బయల్దేరి ఉదయం 6.15 గంటలకు మైసూరుకు చేరుకుంటాయి.
బెంగళూరులో ఈ రైలు సేవలు ఈనెల 21నుంచి 25వరకు అందుబాటులో ఉంటాయని బెంగళూరు డివిజన్ పేర్కొంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 5న లక్షలాది మంది తెలుగువారు ముంబైలోని చైత్య భూమిని సందర్శించే అవకాశం ఉంది వారి కోసం ప్రత్యేకంగా రైళ్లు నడిపే అవకాశం ఉంది. కరీంనగర్, నల్గొండ నుంచి ప్రత్యేక రైళ్లను నడపాలని, ప్రస్తుతమున్న కొన్ని రైళ్లను క్రమబద్ధీకరించాలని కోరుతూ పలువురు రైల్వేశాఖ మంత్రికి లేఖ రాశారు.












Click it and Unblock the Notifications