రుతుపవనాలు మరింత ఆలస్యం, మనకు అప్పుడే - మండుతున్న రాష్ట్రం..!!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. పలు ప్రాంతాలు ఎండ తీవ్రతకు ఉడికిపోతు న్నాయి. ఈ సారి రుతుపవనాలు ముందస్తుగానే అండమాన్ చేరుకున్నాయి. ఈ రోజు (26వ తేదీ) కేరళలో ప్రవేశిస్తాయని చెప్పుకొచ్చారు. దీంతో.. ఎండ తీవ్రత నుంచి త్వరలోనే బయట పడతామని భావించారు. అయితే.. రుతుపవనాలు మరింత ఆలస్యం అవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో.. ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభం తేదీ పైన తాజాగా అప్డేట్ వచ్చింది.

నైరుతి రుతుపవనాల రాక ఈసారి మరింత ఆలస్యం కానుంది. సాధారణంగా మే చివరి వారంలో ప్రవేశించాల్సిన రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా జూన్ మొదటి వారంలో కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. వడగాల్పుల ప్రభావం పెరిగితే ఇది మరింత ఆలస్యం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణకు జూన్ రెండో వారం నాటికి రుతుపవనాలు ప్రవేశించే సూచనలున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితు ల ప్రకారం ఈ నెల 31-జూన్‌ 2 మధ్య కేరళను తాకే అవకాశముందని వెల్లడించింది. అయితే, వడగాలుల ప్రభావం మరింత పెరిగితే రుతుపవనాల రాక మరింత ఆలస్యం కావచ్చని పేర్కొంది. తెలంగాణకు జూన్‌ రెండోవారంలో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

 ప్రకాశం జనసేన కమిటీ రద్దు, బాలినేని ఎపిసోడ్- పవన్ నిర్ణయం వెనుక..!!
ప్రకాశం జనసేన కమిటీ రద్దు, బాలినేని ఎపిసోడ్- పవన్ నిర్ణయం వెనుక..!!
southwest-monsoon-onset-over-kerala-will-be-delayed-by-three-days-and-is-expected-to-happen-on-june

తాజా అంచనాలు

కాగా, రుతుపవనాల రాకకు ముందే కేరళలో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఎండలతో మండిపోతున్న ఉత్తరభారతానికి ఐఎండీ మరో హెచ్చరిక జారీచేసింది. పశ్చిమ అలజడుల కారణంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లోని రాష్ట్రాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పిడుగులు పడతాయని తెలిపింది. ఆయా రాష్ట్రాలకు యెల్లో అలర్ట్‌ జారీచేసింది. మరోవైపు, రుతుపవనాల రాక ఆలస్యమవుతుండటంతో తెలంగాణలో ఎండల తీవ్రత, వడగాల్పులు ప్రాణాలు తీస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు తీవ్రమైన ఎండలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఎండల తీవ్రతకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ కారణంగా 42 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అత్యధికంగా వరంగల్‌లో 20 మంది ఉండగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 మంది, కరీంనగర్‌లో 8 మంది ఉన్నారు. ఒకవైపు ఎండలు మండిపోతున్నా, సోమవారం సాయంత్రం నల్లగొండ, వికారాబాద్‌, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+