వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను మాట్లాడా, ఎమ్మెల్యేలపై వేటు వేయొచ్చు: జగన్‌కు స్పీకర్ వార్నింగ్!

అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావొద్దని నిర్ణయించుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. ఆయన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావొద్దని నిర్ణయించుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. ఆయన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

చదవండి: శ్రీవారిని దర్శించుకున్న జగన్: వందలమంది ఒకేసారి, చెప్పులతో, మళ్లీ వివాదం?

వైసిపి ఎమ్మెల్యేలతో మాట్లాడా

వైసిపి ఎమ్మెల్యేలతో మాట్లాడా

అసెంబ్లీకి రావొద్దని నిర్ణయించుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో తాను మాట్లాడానని చెప్పారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి తాము సమావేశాలకు రాలేమని వారు చెప్పారని కోడెల అన్నారు.

ఆశ్చర్యానికి గురి చేసింది

ఆశ్చర్యానికి గురి చేసింది

వైసిపి ఎమ్మెల్యేలు సభకు రాకపోవడం తనను ఆశ్యర్యానికి గురి చేసిందని కోడెల అన్నారు. సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ఓటు వేసి పంపితే సభకు హాజరుకాకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. హాజరుకాకపోవడం అంటే ఓటు వేసిన ప్రజలకు అన్యాయం చేసినట్లే అన్నారు.

మూడు సెషన్లకు రాకుంటే వేటు వేసే అవకాశం

మూడు సెషన్లకు రాకుంటే వేటు వేసే అవకాశం

వరుసగా మూడు అసెంబ్లీ సెషన్లకు హాజరుకాకుంటే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అవకాశం చట్టంలో ఉందని కోడెల చెప్పారు. గతంలో ఎన్టీఆర్, జయలలితలు సభకు హాజరుకాకపోవచ్చు, కానీ ఎమ్మెల్యేలు హాజరయ్యారని చెప్పారు.

అనర్హత పిటిషన్ల పైన ఇలా

అనర్హత పిటిషన్ల పైన ఇలా

అనర్హత పిటిషన్లపై మాట్లాడుతూ... కోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని నియమిస్తుందని, అనర్హత పిటిషన్లపై సుప్రీం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.

English summary
Speaker Kodela Sivaprasad Rao talks about YSR Congress Party for not attend assembly sessions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X