శ్రీవారిని దర్శించుకున్న జగన్: వందలమంది ఒకేసారి రావడంతో, మళ్లీ వివాదం?

Posted By:
Subscribe to Oneindia Telugu
  శ్రీవారిని దర్శించుకున్న జగన్:మళ్లీ వివాదం ! ఎందుకంటే? | Oneindia Telugu

  తిరుపతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం వేకువజామున కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

  వైయస్‌తో పాటు పెద్ద ఎత్తున నాయకులు శ్రీవారి దర్శానానికి వచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఉన్నారు. జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర సోమవారం నుంచి ప్రారంభం కానుంది.

  వందలమంది రావడంతో తనిఖీ చేయలేక

  వందలమంది రావడంతో తనిఖీ చేయలేక

  ఈ నేపథ్యంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే, వైసిపి నాయకులను తనిఖీ చేయకుండానే ఎస్పీఎఫ్ సిబ్బంది లోనికి పంపించినట్లుగా తెలుస్తోంది. అంతమంది ఒకేసారి గ్రూపుగా రావడంతో తనిఖీలు చేయలేకపోయారని తెలుస్తోంది. వందలాది మంది ఒకేసారి వస్తే ఎలా తనిఖీలు చేస్తామని ఎస్పీఎఫ్ సిబ్బంది అడిగారని తెలుస్తోంది.

  క్యూ కాంప్లెక్స్ వరకు చెప్పులతో

  క్యూ కాంప్లెక్స్ వరకు చెప్పులతో

  జగన్ వెంట వచ్చిన వారిలో కొందరు క్యూ కాంప్లెక్స్ వరకు చెప్పులతో వచ్చారని వార్తలు వస్తున్నాయి. ఓ మహిళా నేత అక్కడి దాకా చెప్పులతో రాగా భద్రతా సిబ్బంది వారించారని, దీంతో ఆమె అక్కడే చెప్పులు వదిలేశారని అంటున్నారు.

  గతంలోను వివాదం

  గతంలోను వివాదం

  వైయస్ జగన్ గతంలో తిరుమలకు వచ్చినప్పుడు కూడా వివాదం రాజుకుంది. అన్యమతస్తులు తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే డిక్లరేషన్ పైన సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ అప్పుడు జగన్‌తో సంతకం చేయించుకోలేదనే వివాదం తెరపైకి వచ్చింది.

  జగన్ వెంట నేతలు

  జగన్ వెంట నేతలు

  కాగా, జగన్ అంతకుముందు శుక్రవారం రాత్రి పదింపావుకు రాధేయ అతిథి గృహానికి చేరుకున్నారు. రిసెప్షన్ సూపరింటెండెంట్ ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఆయన వెంట విజయ సాయి రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వరప్రసాద్, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, రోజా తదితరులు ఉన్నారు.

  పేరు మార్పుపై వివరణ

  పేరు మార్పుపై వివరణ

  ప్రజా సంకల్ప యాత్ర కోసం జగన్ పేరు మార్చుకున్నారని ప్రచారం జరిగింది. దీనిని వైసిపి కొట్టి పారేసింది. జగన్ పేరు మార్చుకున్నారనే వార్తలను ఎవరూ నమ్మవద్దని చెప్పాయి. ఏదైనా ప్రత్యేక అంశం ఉంటే పత్రికా ప్రకటన ద్వారా అందరికీ తెలియజేస్తామన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSR Congress party chief YS Jaganmohan Reddy visited Tirumala on Saturday before taking Praja Sankalpa Padayatra.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి