వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో మూడుసార్లు సీఎం జగనే.. తమ్మినేని; సింహాన్ని ఎన్ని జంతువులు ఏకమైనా ఏం చెయ్యలేవన్న ధర్మాన

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ కూడా ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు వల్ల టిడిపి మీదనే కాకుండా రాజకీయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోయిందని తమ్మినేని సీతారాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రతిపక్ష పార్టీలకు ఏడుపు నామ సంవత్సరం 2021; వారి కడుపుమంట అందుకే: అంబటి రాంబాబుప్రతిపక్ష పార్టీలకు ఏడుపు నామ సంవత్సరం 2021; వారి కడుపుమంట అందుకే: అంబటి రాంబాబు

 నాడు వాగ్దానాలు చేసి మర్చిపోయిన చంద్రబాబు : తమ్మినేని సీతారాం

నాడు వాగ్దానాలు చేసి మర్చిపోయిన చంద్రబాబు : తమ్మినేని సీతారాం

అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాకుళానికి టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు చాలా వ్యత్యాసం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మళ్లీ తాము అధికారంలోకి వస్తే వన్టైమ్ సెటిల్మెంట్ ఫ్రీగా చేస్తామని, పేదలకు గృహాలపై హక్కులను ఉచితంగా కల్పిస్తామని చెబుతున్న చంద్రబాబు, అధికారంలో ఉన్న సమయంలో ఏం చేశారో చెప్పాలంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిలదీశారు. నాడు వాగ్దానాలు ఇచ్చి మర్చిపోయారని తమ్మినేని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరో రెండు మూడు సార్లు జగనే సీఎం : ఏపీ స్పీకర్

మరో రెండు మూడు సార్లు జగనే సీఎం : ఏపీ స్పీకర్


సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట కోసం కట్టుబడి పనిచేస్తున్నారని పేర్కొన్న ఆయన రాష్ట్రంలో ప్రజలు సీఎం జగన్ పై నమ్మకంతో ఉన్నారంటూ అభిప్రాయపడ్డారు. మరో రెండు మూడు సార్లు జగనే సీఎం అవుతారంటూ తమ్మినేని సీతారాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎం జగన్ ప్రభుత్వాల మధ్య అభివృద్ధి సంక్షేమం లో ఉన్న వ్యత్యాసం గురించి తాను మరోసారి విపులంగా మాట్లాడతానని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.

సింహాన్ని ఎదుర్కోవటం ఆ జంతువుల వల్ల కాదు: ధర్మాన కృష్ణ దాస్

సింహాన్ని ఎదుర్కోవటం ఆ జంతువుల వల్ల కాదు: ధర్మాన కృష్ణ దాస్

ఇదిలా ఉంటే ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఏపీలో తాజా పరిణామాలపై స్పందించారు. సింహాన్ని ఎదుర్కోవడం కోసం ఎన్ని జంతువులు ఏకమైన ఏమీ చేయలేవని, వచ్చే ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుండే ఏకమవుతున్నాయి అంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం అమరావతి రాజధాని అంశాన్ని ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ది కోసం ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విశాఖ రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.

 శ్రీకాకుళం ఎంతో వెనకబడింది, అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ

శ్రీకాకుళం ఎంతో వెనకబడింది, అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ

ఇతర జిల్లాలతో పోల్చి చూస్తే శ్రీకాకుళం జిల్లా ఎంతో వెనుకబడి ఉందని పేర్కొన్న ధర్మాన కృష్ణదాస్ వికేంద్రీకరణలో భాగంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకొని సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. తాము అమరావతి ని మార్చడం లేదని, అమరావతి శాసన రాజధానిగా ఉంటుందంటూ పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలను ఏక కాలంలో ప్రగతి పథంలో నడిపించడం కోసం వైసీపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు ధర్మాన కృష్ణదాస్.

 ఆ పార్టీలు అన్నీ మళ్ళీ కలిసి పోటీ చేస్తాయి.. అయినా సరే వైసీపీదే విజయం

ఆ పార్టీలు అన్నీ మళ్ళీ కలిసి పోటీ చేస్తాయి.. అయినా సరే వైసీపీదే విజయం

రాష్ట్రం అంటే కేవలం ఒక ప్రాంతం అభివృద్ధి చెందటం కాదని ఆయన పేర్కొన్నారు జనసేన, బీజేపీ, టీడీపీ మళ్లీ కలిసి పోటీ చేస్తాయని సంకేతాలు వస్తున్నాయని ,ఎంతమంది వచ్చినా వైసిపిని ఏం చేయలేవు అని ధర్మాన కృష్ణదాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని ప్రజలు మళ్లీ సీఎం జగన్మోహన్ రెడ్డి కే పట్టం కడతారని ఏపి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తేల్చి చెప్పారు.

English summary
Speaker Tammineni Sitaram was angry with Chandrababu. AP Deputy CM Dharmana Krishna Das also lashed out at the opposition parties. Two or three more times Jagan will be the CM and the people will be crowned YSRCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X