పవన్ కు మరో అరుదైన గౌరవం - చంద్రబాబు ఆదేశాలు..!!

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రివర్గంలో పవన్ కు మాత్రమే డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. పవన్ కోరుకున్న విధంగా శాఖలను ఖరారు చేసారు. మహిళకు హోం శాఖ కేటాయించారు. ఇక..కొత్త ప్రభుత్వం పాలనా వ్యవహారాల్లో భాగంగా పవన్ కు గౌరవం పెంచేలా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

పవన్ కు ప్రాధాన్యత
ఎన్డీఏ కూటమి విజయంలో పవన్ పాత్ర కీలకంగా ఉంది. పవన్ కు ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను సరి చేస్తూ చంద్రబాబు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రివర్గంలో పవన్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. మరెవరికీ ఈ హోదా ఇవ్వకపోవటం ద్వారా ఆ పదవికి పవన్ ను మాత్రమే పరిమితం చేసారు. ఇక, పవన్ కు హోం శాఖ ఇస్తారని ప్రచారం సాగినా..జనసేనాని కోరుకున్న శాఖలను కేటాయించారు.

Special honour for Dy CM Pawan Kalyan as CM Chandra Babu latest orders

అరుదైన గౌరవం
పవన్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కు పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్ టెక్నాలజీ శాఖలు పర్యవేక్షించనున్నారు. త్వరలోనే తన మంత్రిత్వ శాఖలకు సంబంధించి పవన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు మరో నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫొటో ఉండటం ఆనవాయితీ. ఇప్పుడు ముఖ్యమంత్రి తో పాటుగా ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ ఫొటో కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Special honour for Dy CM Pawan Kalyan as CM Chandra Babu latest orders

తాజా నిర్ణయంతో
ప్రభుత్వ కార్యక్రమాలు..ప్రభుత్వ ప్రచార అంశాల్లోనూ ముఖ్యమంత్రి ఫొటో ఎక్కడైతే వినియోగించాల్సి వస్తుందో..అక్కడ పవన్ ఫొటో ఉండేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. దీని ద్వారా పవన్ డిప్యూటీ సీఎంగా ఉంటున్నా..ఎక్కడా ప్రాధాన్యత తగ్గకూడదని భావిస్తున్నారు. ఇక..ఎన్నికల్లో కూటమి విజయం లో కీలకంగా వ్యవహరించిన పవన్..పాలనలో ఏరి కోరి తీసుకున్న శాఖలకు సంబంధించి ఎలాంటి మార్పు చూపిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+