నిత్య అన్న ప్రసాదం ట్రస్టుకి 30 ఏళ్లు (ఫోటోలు)
హైదరాబాద్: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ఏర్పాటైన నిత్య అన్న ప్రసాదం ట్రస్టు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం వేడుకను నిర్వహించారు. 1985 ఏప్రిల్ 6న అప్పటి ముఖ్యమంత్రి, దివంగత శ్రీ నందమూరి తారక రామారావు చేతుల మీదగా నిత్య అన్న ప్రసాదం ట్రస్టుతో పాటు శ్రీవారికి తల నీలాల సమర్పణకు కళ్యాణ కట్ట నిర్మాణం, రక్తదాన నిధి ఏర్పాటయ్యాయి.
ఆనాడు 2 వేల మందితో ప్రారంభమైన నిత్య అన్న ప్రసాదం ఈరోజుకి లక్ష మందికి జరుగుతోంది. ట్రస్టు కింద 3.63 లక్షల మంది భక్తులు రూ. 591 కోట్ల విరాళాన్ని అందించారు. విరాళాలను బ్యాంకుల్లో డిపాజిట్ చేసి వచ్చే వడ్డీ ద్వారా పథకాన్ని నడుపుతున్నారు.
ప్రతి ఏటా ఈ పథకానికి రూ. 70 కోట్లను ఖర్చు పెడుతున్నారు. నిత్య అన్న ప్రసాదం తయారీ పాలనా వ్యవహారాలు చూసేందుకు గాను 1,250 మంది సిబ్బందితో పాటు నిత్యం 400 మంది శ్రీవారి భక్తులు సేవలు అందిస్తున్నారు.

నిత్య అన్న ప్రసాదం ట్రస్టుకి 30 ఏళ్లు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ఏర్పాటైన నిత్య అన్న ప్రసాదం ట్రస్టు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం వేడుకను నిర్వహించారు.

నిత్య అన్న ప్రసాదం ట్రస్టుకి 30 ఏళ్లు
అన్న ప్రసాదాల తయారీకి రోజుకు 13 టన్నుల బియ్యం, 6 టన్నుల కూరగాయాలు వినియోగిస్తున్నారు. కూరగాయలు పూర్తిస్ధాయిలో విరాళంగానే అందుతున్నాయి. 30 సంవత్సరాల వేడుకలో తిరుమల తిరుపతి కార్యనిర్వహణ అధికారి సాంబశివరావు మాట్లాడారు.

నిత్య అన్న ప్రసాదం ట్రస్టుకి 30 ఏళ్లు
ఆయన మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కృషితో శ్రీ వెంకటేశ్వర నిత్య అన్న ప్రసాదం ట్రస్టు, శ్రీవారికి తలనీలాల సమర్పణకు కల్యాణకట్ట నిర్మాణం, రక్తదాన నిధి ఏర్పాటయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కృషి మరువ లేనిదన్నారు.

నిత్య అన్న ప్రసాదం ట్రస్టుకి 30 ఏళ్లు
ఇక ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. స్వామి వారికి భక్తులు శనివారం సమర్పించిన కానుకలను లెక్కించగా రూ. 4.09 కోట్లు మేరకు వచ్చినట్లు తెలిపారు.

నిత్య అన్న ప్రసాదం ట్రస్టుకి 30 ఏళ్లు
ఇక ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. స్వామి వారికి భక్తులు శనివారం సమర్పించిన కానుకలను లెక్కించగా రూ. 4.09 కోట్లు మేరకు వచ్చినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications