విజయవాడ, గుంటూరు, నరసాపూర్, నల్గొండవారికి ముఖ్య గమనిక
వరుస సెలవుల నేపథ్యంలో భారీగా రద్దీ నెలకొన్న దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-నరసాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు
No.07169: నరసాపూర్-సికింద్రాబాద్ ప్రత్యేక రైలును ఈ నెల 15న నడపనున్నారు. నరసాపూర్ లో సాయంత్రం 6.00 గంటలకు బయలుదేరి.. భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, పగిడిపల్లి మీదుగా తర్వాతరోజు ఉదయం 3:50 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.

07170: సికింద్రాబాద్-నరసాపూర్ ప్రత్యేక రైలును ఈ నెల 16వ తేదీన నడపనున్నట్లు దక్షిణ మద్య రైల్వే ప్రకటించింది. ఆరోజు రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరి ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, పాలకొల్లు మీదగా తర్వాత రోజు ఉదయం 8.35 గంటలకు నరసాపూర్ చేరుకుంటుంది. ఇందులో పేర్కొన్న స్టేషన్లలో రైలును ఆపుతారు.
వందేభారత్ కోసం
మార్పులకు అనుగుణంగా భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు అధునాతన సౌకర్యాలతో ప్రయాణికులకు మెరుగైన రైలు ప్రయాణాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా 25 మార్గాల్లో సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ ను ప్రవేశపెట్టారు. దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే దూరాన్ని తగ్గించాలని, రాకపోకలను పెంచాలనే ఉద్దేశంతో వీటిని తీసుకొచ్చారు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. కానీ ట్రాక్ సామర్థ్యం దృష్ట్యా 120 నుంచి 130 కిలోమీటర్ల వేగానికి పరిమితం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే మరో రెండు రైళ్లను ప్రవేశపెట్టబోతున్నారు












Click it and Unblock the Notifications