ఏపీ ప్రజలకు శుభవార్త.. అయోధ్యకు ప్రత్యేక రైళ్లు

తన సొంత గడ్డ అయోధ్యలో బాలరాముడు కొలువుతీరాడు. ప్రపంచవ్యాప్తంగా అశేష జనవాహిని ఈ కార్యక్రమాన్ని తిలకించి పులకించిపోయింది. దేశవ్యాప్తంగా ప్రజలంతా అయోధ్య రామ్ లల్లాను దర్శించుకునేందుకు బారులు తీరారు. వీరందరికీ ఇండియన్ రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అయోధ్యలో ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించిన రైల్వే స్టేషన్ కు అయోధ్య ధామ్ అని పేరు పెట్టారు. పనిలో పనిగా ఏపీ నుంచి కూడా ప్రత్యేక రైళ్లను భక్తుల కోసం నడుపుతున్నారు.

ఫిబ్రవరి 7 బుధవారం 07217 నెంబర్ తో రాజమండ్రి-అయోధ్య మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు బయలుదేరనుంది. బుధవారం సాయంత్రం 5.30 గంటలకు రాజమండ్రిలో బయలుదేరి అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌, పలాస మీదుగా అయోధ్యధామ్ కు శుక్రవారం రాత్రి 11.00కి వెళుతుంది.

special trains from ap to ayodhya

ఇదే నెంబరుతో అయోధ్య ధామ్‌-రాజమండ్రి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు ఫిబ్రవరి 10 శనివారం బయలుదేరుతుంది. రాత్రి 11.00 గంటలకు బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 2.00 గంటలకు రాజమండ్రి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఇదే మార్గంలో రాజమండ్రి వస్తుంది. 1870 కిలోమీటర్ల దూరానికి 40 గంటలపాటు ప్రయాణించాల్సి ఉంటుంది.

గుంటూరు-అయోధ్య-గుంటూరు (07215)..
విజయవాడ-అయోధ్య-విజయవాడ (07216)
అయోధ్య-సామర్లకోట-అయోధ్య (07218)
నుంచి కూడా మరో రెండు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+