హైదరాబాద్, తిరుపతి, విజయవాడవారికి శుభవార్త

జులై, ఆగస్ట్‌ నెలల్లో నడపబోయే ప్రత్యేక రైళ్లను (Special Trains) దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి మార్గాల్లో ఇవి నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైల్వే ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. తాజాగా 14 రైళ్లను జులై 1 నుంచి ఆగస్టు 29 వరకు పొడిగించింది. ఏయే మార్గాల్లో ప్రయాణం చేయబోతున్నాయో వాటి వివరాలు తెలుసుకుందాం.

నెంబర్ 07605 తిరుపతి నుంచి అకోలా.. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతిలో బయలుదేరి తర్వాత రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు అకోలా చేరుకుంటుంది. జులై 7 నుంచి ఆగస్టు 25 వరకు దీన్ని పొడిగించారు.
నెంబర్ 07606 అకోలా నుంచి తిరుపతి.. ప్రతి ఆదివారం ఉదయం 8.10 గంటలకు అకోలాలో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 6.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 2023 జూలై 9 నుంచి ఆగస్ట్ 27 వరకు దీన్ని పొడిగించారు.

special trains from july 2nd to august 27th

నెంబర్ 07091 కాజీపేట్ నుంచి తిరుపతి.. ప్రతి మంగళవారం ఉదయం 11.00 గంటలకు కాజీపేట్‌లో బయల్దేరి రాత్రి 10.10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. జులై 4 నుంచి ఆగస్ట్ 28 వరకు పొడిగించారు.
రైలు నెంబర్ 07092 తిరుపతి నుంచి కాజీపేట.. ప్రతి మంగళవారం రాత్రి 11.40 గంటలకు తిరుపతిలో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 10.45 గంటలకు కాజీపేట్ చేరుకుంటుంది. జులై 4 నుంచి ఆగస్ట్ 29 వరకు పొడిగించారు.

నెంబర్ 07631 హైదరాబాద్ నుంచి నర్సాపూర్‌.. ప్రతి శనివారం రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 8.35 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. జులై 1 నుంచి ఆగస్ట్ 26 వరకు పొడిగించారు.
నెంబర్ 07632 నర్సాపూర్ నుంచి హైదరాబాద్‌.. ప్రతి ఆదివారం రాత్రి 8.00 గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. జులై 2 నుంచి ఆగస్ట్ 27 వరకు పొడిగించారు.

నెంబర్ 07643 హైదరాబాద్ నుంచి తిరుపతి.. ప్రతి సోమవారం రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 10.00 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. జూలై 3 నుంచి ఆగస్ట్ 28 వరకు పొడిగించారు.
నెంబర్ 07644 తిరుపతి నుంచి హైదరాబాద్‌.. ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3.00 గంటలకు తిరుపతిలో బయల్దేరి తర్వాతరోజు తెల్లవారుజామున 5.00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. జులై 4 నుంచి ఆగస్ట్ 29 వరకు పొడిగించారు.

నెంబర్ 07698 విజయవాడ నుంచి నాగర్‌సోల్‌.. ప్రతి శుక్రవారం సాయంత్రం 4.15 గంటలకు విజయవాడలో బయల్దేరి తర్వాత రోజు మధ్యాహ్నం 2.10 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటుంది. విజయవాడ-నాగర్‌సోల్ రైలును జూలై 7 నుంచి ఆగస్ట్ 25 వరకు పొడిగించారు.
నెంబర్ 07699 నాగర్‌సోల్ నుంచి విజయవాడ.. ప్రతి శనివారం రాత్రి 10.00 గంటలకు నాగర్‌సోల్‌లో బయల్దేరి తర్వాతరోజు సాయంత్రం 5.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. జూలై 8 నుంచి ఆగస్ట్ 26 వరకు పొడిగించారు.

నెంబర్ 07185 మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్‌.. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3.15 గంటలకు మచిలీపట్నంలో బయల్దేరి రాత్రి 11.00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. జూలై 2 నుంచి ఆగస్ట్ 27 వరకు పొడిగించారు.
నెంబర్ 07186 సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం.. ప్రతి ఆదివారం రాత్రి 11.55 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 8.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. జూలై 2 నుంచి ఆగస్ట్ 27 వరకు పొడిగించారు.

నెంబర్ 07481 తిరుపతి నుంచి సికింద్రాబాద్‌.. ప్రతి ఆదివారం రాత్రి 7.50 గంటలకు తిరుపతిలో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. జూలై 2 నుంచి ఆగస్ట్ 27 వరకు పొడిగించారు.
నెంబర్ 07482 సికింద్రాబాద్ నుంచి తిరుపతి.. ప్రతి సోమవారం సాయంత్రం 5.50 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 7.10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. జూలై 3 నుంచి ఆగస్ట్ 28 వరకు పొడిగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+