కాకినాడ, తిరుపతి, విజయవాడ, వరంగల్ ప్రజలకు ముఖ్య గమనిక

ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక రైళ్లను డిసెంబరు నెలాఖరు వరకు పొడిగించారు. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. డిసెంబరు1 నుంచి 29 వరకు( ప్రతి శుక్రవారం) తిరుపతి-అకోలా (07605) రైలు నడుస్తుంది. డిసెంబరు 3 నుంచి 30వ తేదీ వరకు అకోలా-తిరుపతి (07606) రైలు ప్రతి ఆదివారం నడుస్తుంది. ఈ రైళ్లు పాకాల, పీలేరు, మదనపల్లిరోడ్డు, కదిరి, ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూలు సిటీ, గద్వాల్, మహబూబ్ నగర్, కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్కేఢ్, నాందేడ్, పూర్ణ, బస్మత్, హింగోలి డెక్కన్, వాషిమ్ స్టేషన్లలో ఆగుతుంది.

డిసెంబరు 4 నుంచి 25 వరకు ప్రతి సోమవారం పూర్ణ-తిరుపతి(07609), డిసెంబరు 5నుంచి 26 వరకు ప్రతి మంగళవారం తిరుపతి-పూర్ణ (07610) రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఇవి పూర్ణ, పర్బణి, గంగాఖేర్, పర్లి వైద్యనాథ్, లాతూరు రోడ్, ఉద్గిర్, బీదర్, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి జంక్షన్, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.

special trains from kakinada to lingampalli

డిసెంబరు 2 నుంచి 30 వరకు ( ప్రతి శనివారం) హైదరాబాద్‌-నర్సాపూర్‌ (07631), డిసెంబరు 3 నుంచి 31వ తేదీ వరకు (ప్రతి ఆదివారం) నర్సాపూర్‌- హైదరాబాద్‌ (07632) రైళ్లు నడుస్తాయి. ఇవి సికింద్రాబాద్, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతాయి.

డిసెంబరు 3 నుంచి 31వ తేదీ వరకు (ప్రతి ఆదివారం) తిరుపతి-సికింద్రాబాద్‌ (07481), డిసెంబరు 4 నుంచి 25వ తేదీ వరకు (ప్రతి సోమవారం) సికింద్రాబాద్‌-తిరుపతి (07482)రైళ్లు నడుస్తాయి. ఇవి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, ఖాజీపేట, జనగాం స్టేషన్లలో ఆగుతాయి.

డిసెంబరు 1 నుంచి 29 వరకు (ప్రతి సోమ, బుధ, శుక్రవారాలు) కాకినాడ టౌన్‌-లింగంపల్లి (07445),
డిసెంబరు 2 నుంచి 30 వరకు (ప్రతి మంగళ, గురు, శనివారాలు) లింగంపల్లి-కాకినాడ టౌన్‌ (07446) మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఇవి సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+