రేపు ఏపీలో వ్యాక్సినేషన్ స్పెషల్‌ డ్రైవ్‌-ఒక్కరోజే 8 లక్షల డోసులు

ఏపీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సెకండ్‌ వేవ్ సమయంలో వ్యాక్సినేషన్ చేపట్టినా డోసులు లేకపోవడంతో అది ముందుకు సాగలేదు. దీంతో ఇప్పుడు తాజాగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లతో రేపు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రేపు భారీ ఎత్తున వ్యాక్సిన్‌ డోసులు వేయనున్నారు.

రేపు ఒక్కరోజే ఏపీలో రికార్డు స్ధాయిలో 8 లక్షల వ్యాక్సిన్‌ డోసులు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. క్షేత్రస్ధాయిలో వ్యాక్సినేషన్‌ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేస్తున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి స్ధానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో, పట్ఠణ ఆరోగ్య కేంద్రాల్లో, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ డోసులు వేయనున్నారు.

special vaccination drive in ap tomorrow, 8 lakh doses will be adminstered

Recommended Video

    Ys Jagan Govt చేసింది ఇదీ.. చేయబోతోంది ఇదీ | Ap Jobs Calendar 2021 || Oneindia Telugu

    వ్యాక్సినేషన్ కోసం ఎలాంటి రిజిస్ట్రేషన్‌ అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నేరుగా ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి పేర్లు నమోదు చేసుకుని వ్యాక్సిన్‌ వేయించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఒక్క రోజులో 6 లక్షల వ్యాక్సిన్లు వేసిన రికార్డు అందుకున్న ప్రభుత్వం రేపు 8 లక్షల డోసులతో ఈ రికార్డును మరింత మెరుగుపర్చుకోనుంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో కోటీ 22 లక్షల 83 వేల 479 డోసులు వేశారు. ఇప్పటివరకు 5లక్షల 29వేల మంది ఐదేళ్ల లోపు పిల్లల తల్లులకు తొలి డోస్ కూడా వేశారు. రేపటి వ్యాక్సినేషన్‌లో కరోనా థర్డ్‌వేవ్‌ దృష్ట్యా ఐదేళ్ల లోపు పిల్లలున్న తల్లులకు ప్రాధాన్యం ఇస్తారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+