Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దం, కీలక చర్చలు..!?

వైఎస్సార్ ఫ్యామిలీ నుంచి మూడో తరం పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దమైంది. ఇప్పటికే షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ ఎంట్రీ పైన సంకేతాలు ఇచ్చారు. కాగా.. మారుతున్న పరిస్థితులు.. భవిష్యత్ ఆలోచనలతో జగన్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీ పైన పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జగన్ దంపతులు లండన్ పర్యటనలో ఉన్నారు.. జగన్ ఇద్దరు కుమార్తె లు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఉన్నత విద్య.. ఉద్యోగాల్లో స్థిర పడ్డారు. కాగా, ఇప్పుడు జగన్ కుమార్తె ఎంట్రీ పైన పార్టీలో కొత్త చర్చ మొదలైంది.

వారసురాలి ఎంట్రీ
వైఎస్సార్ బిడ్డలుగా జగన్ - షర్మిల ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారు. తండ్రి మరణం తరువాత అనేక రాజకీయ ఆటు పోట్లు ఎదుర్కొన్న జగన్ అయిదేళ్లు సీఎంగా పని చేసారు. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. కాగా.. జగన్ తో విభేదించిన షర్మిల తొలుత తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి ఆ తరువాత కాంగ్రెస్ లో చేరి ఏపీలో పీసీసీ చీఫ్ అయ్యారు. జగన్ లక్ష్యంగా షర్మిల తన రాజకీయం కొనసాగిస్తున్నారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి సైతం త్వరలో రాజకీయ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దమైనట్లు కనిపిస్తోంది. జగన్ తల్లి విజయమ్మ సైతం ఎక్కువగా షర్మిలతో ఉంటున్నారు. కాగా, జగన్ మొత్తంగా పార్టీ వ్యవహారాలను చూసుకోవాల్సి వస్తోంది. సీనియర్ నేతలు ఉన్నా.. పార్టీకి జగన్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.

Speculations are rising about YS Jagan s daughter making her political debut next year

కీలక సమీకరణాలు
జగన్ సతీమణి భారతి ఎన్నికల సమయంలో మినహా రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో షర్మిల, విజయమ్మ వైసీపీ కోసం... జగన్ కు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు వారు దూరంగా ఉన్నారు. ఈ సమయంలో భవిష్యత్ అవసరాల కోసం జగన్ కుమార్తె రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. జగన్ రాజకీయాలతో సంబంధం లేకుండా ఇద్దరు కుమార్తెలు లండన్ లో చదువుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు.. సీఎం గా జగన్ ప్రమాణ స్వీకార వేళ మాత్రమే ఆ ఇద్దరూ అందరి ముందుకు వచ్చారు. జగన్ పెద్ద కుమార్తె హర్షా రెడ్డి ఫ్రాన్స్ లో ఎంబీఏ పూర్తి చేసారు. ప్రస్తుతం లండన్ లో ఉంటున్నారు. చిన్న కుమార్తె వర్షా రెడ్డి నోస్టర్ డాం యూనివర్సిటీలో ఉన్నత విద్య పూర్తి చేసుకున్నారు.

Speculations are rising about YS Jagan s daughter making her political debut next year

అంగీకరిస్తారా..?
సింగపూర్ లోని ప్రముఖ సంస్థలో అత్యున్నత స్థాయిలో ఉద్యోగం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసుకోవటంతో పాటుగా 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ ఇక తిరిగి రాజకీయంగా పూర్తి సమయం కేటాయించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. వ్యాపారాలను .. కుటుంబ వ్యవహారాలను భారతి పర్యవేక్షిస్తున్నారు. ఈ సమయంలో జగన్ కుమార్తె రాజకీయంగా ఎంట్రీ పార్టీ భవిష్యత్ కు అవసరమని.. ప్రస్తుత జగన్ లండన్ పర్యటనలో ఈ మేరకు నిర్ణయం జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జగన్ కుమార్తె వచ్చే ఎన్నికల్లో కడప నుంచి ఎంపీగా బరిలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి.. పార్టీలో చర్చ జరుగుతున్నట్లుగా జగన్ తన కుమార్తెలను రాజకీయాల్లోకి తీసుకొస్తారా.. వారు ఆసక్తిగా ఉన్నారా.. అంగీకరిస్తే.. వారి ఎంట్రీ ఎలా ఉంటుందీ... ఎలాంటి ప్రభావం చూపిస్తారనేది ఇప్పుడు పార్టీలో ఆసక్తికరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+