Sri Chaitanya విద్యాసంస్థల ఛైర్మన్ బీఎస్ రావు కన్నుమూత

BS Rao : శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ డాక్ట‌ర్ బీఎస్ రావు కన్ను మూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. మరికాసేపట్లో బీఎస్ రావు భౌతికకాయాన్ని హైదరాబాద్ నుండి విజయవాడకు తరలించనున్నట్టు సమాచారం.రేపు విజయవాడలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

బీఎస్ రావు పూర్తి పేరు బొప్పన సత్యనారాయణ రావు. బీఎస్ రావు దంపతులు ఇంగ్లాండ్, ఇరాన్ లలో వైద్యులుగా సేవలు అందించారు. ఆపై వారు ఇరాన్ నుండి ఇండియాకు రావటంతో వారి కుమార్తెలను ఉన్నత చదువుల కోసం కళాశాలలో చేర్పించేందుకు బాలికల కళాశాలను వెతికారు. సరైన కళాశాల ఏది లభించకపోవడంతో కళాశాలను ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పించారు.

bsraopassedaway1

ఆ సంకల్పం నుండే 1986లో శ్రీ చైతన్య విద్యా సంస్థలను బీఎస్ రావు ప్రారంభించారు. చైతన్య విద్యా సంస్థల చైర్మన్ గా ఆయన ప్రారంభించిన ప్రస్థానం ఇప్పటివరకు లక్షలాది మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతూ సాగుతుంది. బీఎస్ రావు మొదటిసారిగా విజయవాడలో బాలికల జూనియర్ కాలేజీని స్థాపించారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ గా విజయవాడ నుండి చైతన్య విద్యా సంస్థలను ఇతర ప్రాంతాలకు అంచెలంచెలుగా విస్తరించారు.

56 మంది విద్యార్థులతో తొలి బ్యాచ్ ప్రారంభించిన తర్వాత తొమ్మిదేళ్ళ వరకు విస్తరణలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 1995 నుంచి ఈ విద్యా సంస్థను విస్తరించడం మొదలుపెట్టిన ఆయన 2004 నుండి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాలలోనూ విద్యాసంస్థలను విస్తరించారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ లోను శ్రీ చైతన్య విద్యా సంస్థల బ్రాంచ్ లను ఏర్పాటు చేశారు.

ఇప్పటివరకు శ్రీ చైతన్య విద్యా సంస్థలు 321 జూనియ‌ర్ కాలేజీలు, 322 టెక్నో స్కూల్స్, 107 సీబీఎస్ఈ స్కూల్స్‌ తో కొనసాగుతున్నాయి. శ్రీ చైత‌న్య విద్యాసంస్థ‌ల్లో మొత్తం ప్రస్తుతం 8.5 ల‌క్ష‌ల మంది విద్యార్థులు చ‌దువుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యా సంస్థలుగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+