శ్రీచైతన్య కాలేజీలో విషాదం: క్లాస్ రూంలోనే ఎంసెట్ విద్యార్థిని ఆత్మహత్య
విజయవాడ: కార్పొరేటర్ కళాశాలలో మరో విద్యార్థి బలవన్మరణం చోటు చేసుకుంది. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు చైతన్య కళాశాలలో చంద్రిక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
ఎంసెట్ మెడికల్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిని చంద్రకా నాగమణి శనివారం మధ్యాహ్నం కళాశాల క్లాస్ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన నాగమణి చైతన్య కాలేజీలోని వసతి గృహంలో ఉంటూ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటోంది.

మరోవైపు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అలాగే ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చంద్రికా నాగమణి రాసిన సూసైడ్ లేఖలో కీలక సమాచారం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే విద్యార్థిని తల్లిదండ్రులకు పోలీసులు ఆత్మహత్య సమాచారం అందించారు.












Click it and Unblock the Notifications