తిరుమల బ్రహ్మోత్సవాలు, గజేంద్రమోక్ష అలంకారంలో శ్రీనివాసుడు, సర్వభూపాల వాహనం!
తిరుమల/తిరుపతి: కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో (brahmotsavams) భాగంగా బుధవారం రాత్రి సర్వభూపాల వాహనంపై గజేంద్రమోక్ష అలంకారంలో శ్రీవారు భక్తులకు అభయం ఇచ్చారు. తిరుమలలోని తిరుమాడ (tirumala) వీధులలో భక్తులకు (devotees) తనివితీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు.
సర్వభూపాల వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.

బుధవారం సాయంత్రం నుంచి వేలాది మంది భక్తులు (devotees)స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకోవాలని తిరుమాడ వీధుల్లో వేచి చూశారు.నెల రోజుల వ్యవదిలో తిరుమలలో (Tirumala) రెండోసారి బ్రహ్మోత్సవాలు (brahmotsavams)జరుగుతున్నా శ్రీవారి భక్తులు (devotees)వేలాది మంది బ్రహ్మోత్సవాలను చూడటానికి తిరుమల చేరుకుంటున్నారు.

నవరాత్రి సందర్బంగా దేశంలోని వివిద ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నా తిరుమలలో మాత్రం శ్రీవారి భక్తుల (devotees)రద్దీ ఏమాత్రం తగ్గలేదు. తిరుమలకు ఎప్పటిలాగే శ్రీవారి భక్తులు వేలాది మంది తరలివస్తున్నారు.

నవరాత్రి బ్రహ్మోత్సవాలలో (brahmotsavams)ఉదయం, రాత్రి వాహనసేవల్లో వివిధ రాష్ట్రాల కళారూపాల ప్రదర్శనకు భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రతి రోజూ ఒక్కో రాష్ట్రం నుండి కళాకారులు వారి స్థానిక సంప్రదాయ, జానపద కళారూపాలను ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 19న విశేషమైన గరుడ సేవ (brahmotsavams)నాడు దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు.












Click it and Unblock the Notifications