నారాయణ కాలేజీల్లో ఆత్మహత్యలు: చికిత్స పొందుతూ శ్రీకాంత్ మృతి, బెజవాడలో మరో విద్యార్థి
కర్నూలు/ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని నారాయణ రెసిడెన్షియల్ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం విద్యార్థి శ్రీకాంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతను శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.
కల్లూరు మండలం ఉల్లిందకొండ గ్రామానికి చెందిన శ్రీకాంత్ తరగతి గది నుంచి బాత్‌రూమ్ కని బయటకు వచ్చి ఉరేసుకున్నాడు. దీన్ని గమనించిన హాస్టల్ సిబ్బంది శ్రీకాంత్‌ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 9 గంటలకు శ్రీకాంత్ మృతి చెందాడు. చదువులో ఒత్తిడి కారణగానే శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.

నారాయణ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా విజయవాడలో మరో విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. నారాయణ కాలేజీ నిడమనూరు క్యాంపస్‌లో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్న అఖిల్ తేజ్‌కుమార్ రెడ్డి శుక్రవారం కళాశాల పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడు ప్రకాశం ఒంగోలుకు చెందినవాడు. అఖిల్ రెడ్డి మృతదేహాన్ని కామినేని ఆస్పత్రికి తరలించారు. గత నెల 17వ తేదీన కడప నారాయణ కళాశాలలో మనీషా రెడ్డి, నందిని అనే విద్యార్థినులు అనుమానాస్పద స్థితిలో మరణించాడు.












Click it and Unblock the Notifications