పవన్! ఇవేనా మీ ఆదర్శాలు?: తీవ్ర విమర్శలు చేసిన శ్రీరెడ్డి
హైదరాబాద్: సినీ నటి శ్రీరెడ్డి మరోసారి జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శల వర్షం కురిపించారు. పవన్ రాజకీయ కార్యకలాపాలపై ప్రశ్నల సంధించారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, ఆయన తల్లిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న శ్రీరెడ్డి.. తాజాగా సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Recommended Video


ఏమీటీ మాయ
‘మిస్టర్ ..... ఏమిటి ఈ మాయ... పాచి పోయిన లడ్డులు అన్నావు.. ఉత్తరం దక్షిణం అన్నావు.. అవినీతి జరుగుతుందన్నావు.. నిరూపించమంటే నాకు తెలవదు బయట అనుకుంటున్నారు...చూసుకోండి అన్నావు...' అని శ్రీరెడ్డి పవన్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు.

దొంగల్ని పెట్టావు
‘నాకు కులం లేదూ అన్నావు.. మా రంగాను అన్యాయంగా చంపేశారు అని అన్నావు... కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నావు..పెద్ద ఫార్సు చేశావు... లెక్కలు నేను తేలుస్తాను అన్నావు...కమిటీలో దొంగల్ని పెట్టావు..' అంటూ శ్రీరెడ్డి దుయ్యబట్టారు.

పేద్ద ఫోజులు..
‘మా అన్న చేసింది తప్పు అన్నావు..మా అన్న ను మోసం చేసిన వాళ్ల మీద పగ తీర్చుకుంటాను అన్నావు.. నీకు గెలిచే సత్తా లేక పోయినా పేద్ద ఫోజు కొడుతూ మిమ్మల్ని నేనే గెలిపించాను అన్నావు...' శ్రీరెడ్డి ఎద్దేవా చేసింది.

దగా చేశావు
‘పవర్‌ను అనుకున్నావు.. ఎన్ని చెత్త ప్లాప్ సినిమాలో లెక్కేసుకో... ఆడోళ్లంటే ఆటబొమ్మలనకున్నావు.... ఒకటికి మూడు చేసుకున్నావు... నీ అవసరాలకోసం అందర్నీ దగా చేశావు..చివరకు అమ్మకు కూడా బురద పూశావు.. చివరకు చేత కాక నీ నిజ రూపం బయటపెట్టుకున్నావు..' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు శ్రీరెడ్డి.

నిన్ను క్షమించరు..
‘నీకు నటన రాదనుకున్నాము కాని సినిమాల్లో రాకపోయినా బయట బాగానే నటించావు... నిన్నేమనాలి....నువ్వు ఆంధ్రద్రోహివి...ప్రజా ద్రోహివి..జనద్రోహివి. తెలుగుప్రజలు నిన్ను క్షమించరు... ప్రత్యేక హోదా ఇవ్వని మోడీకి కాపలాగా ఉన్నావు.... ఎవరూ ఏమాట మోడీని అన్నా... మోడీని తిడతారా అని ట్విట్టర్ వేదికగా సపోర్ట్ చేస్తున్నావు... ఇదేనా నీవు చేగువేరా నుండి తీసుకున్న ఆదర్శం...' అంటూ శ్రీరెడ్డి ఎద్దేవా చేశారు.
-
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!











Click it and Unblock the Notifications