శ్రీశైలం భక్తులకు శుభవార్త - ఆ సేవల పునరుద్దరణ, తాజా నిర్ణయాలు..!!

శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. తాజాగా ఆలయంలో సంస్కరణల్లో భాగంగా పలువురు సిబ్బందిని మార్పు చేసారు. ఆన్ లైన్ విధానం ద్వారా భక్తులకు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దర్శనంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రణాళికలను అమలు చేస్తున్నారు. కాగా.. గతంలో నిలిచిన సేవలను తిరిగి అందుబాటులోకి తెస్తూ నిర్ణయంతీసుకున్నారు.

శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు బిగ్ అప్డేట్. నిర్వహణ పనుల్లో భాగంగా గత నెల పాటు ఆపేసిన పాతాళ గంగవైపు వెళ్లే టూరిజం రూప్‌వే సేవలను మళ్లీ అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు వెల్లడించారు. శ్రీశైలంలో భక్తులు పుణ్యస్నానాలకు పాతాళగంగకు వెళ్ళే రోప్ వేని తిరిగి పున ప్రారంభించారు. రోప్ వే నిర్వహణ పనులలో భాగంగా గత 30 రోజులుగా నిలుపుదల చేసి నెల రోజులుగా రోప్ వే లోని క్యాబిన్స్, రోప్స్, మిషన్స్ మెయింటెనెన్స్ పనులు చేయించి.. అందుబాటులోకి తెచ్చారు. శ్రీశైలంలోని ఏపి టూరిజం రోప్ తాత్కాలికంగా నిలుపుదల చేశారు భక్తులు మెట్ల మార్గంలో పాతాళగంగకు వెళ్లాలంటే ఈ రోప్ ద్వారా తీగ మార్గంలో ప్రయాణించి పాతాళగంగ వద్దకు చేరుకుని పుణ్య స్నానాలు చేసేవారు.

 మహిళలకు TTD అరుదైన అవకాశం - మీ ప్రాంతంలోనే స్వయంగా మీరే..ఇలా..!!
మహిళలకు TTD అరుదైన అవకాశం - మీ ప్రాంతంలోనే స్వయంగా మీరే..ఇలా..!!
srisailam-mallanna-devotees-get-good-news-as-pathala-ganga-ropeway-service-resumes-here-the-details

పెరుగుతున్న భక్తుల రద్దీ

అయితే, ఏపి టూరిజం రోప్ వే నిర్మాణం జరిగి సుమారు 20 సంవత్సరాలు నిండిన సందర్భంగా భద్రతా ప్రమాణాలలో బాగంగా రోప్ వే మెకానికల్ మెయింటినెన్స్ పనులను పూర్తి చేసారు. రోప్ వే నిర్వహణ పనులలో భాగంగా సుమారు 30 రోజులు పాటు పాతాళగంగ సర్వీసులు నిలుపుదల చేశారు రోప్ వే లోని క్యాబిన్స్,రోప్స్,మిషన్స్ మెయింటెనెన్స్ పనులు చేపట్టారు. శ్రీశైలానికి భక్తుల తాకిడి కూడా స్వల్పంగా తగ్గడంతో మెయింటెనెన్స్ పనులు నిర్వహించారు. మరో 10 సంవత్సరాలు వరకు టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా భక్తుల భద్రతకై రోప్ వే మెకానికల్ మరమ్మతు పనులు నిర్వహించినట్లు వెల్లడించారు. దీని ద్వారా భక్తులకు గతంలో మాదిరే ఇక రోప్ వే ద్వారా యథావిధిగా పాతాళగంగ వద్దకు వెళ్లే వెసులుబాటు కలగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+