సింహవాహనంపై ఊరేగిన తిరుమలేశుడు (పిక్చర్స్)
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు సోమవారం శ్రీవారు సింహవాహనంపై తిరుమాడ వీధుల్ోల ఊరేగాడు. రాక్షసుల మదిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సింహంలా దర్శనమిస్తాడని భక్తులు భావిస్తారు.
దుష్ట జన శిక్షణ, శిష్ట జన రక్షణకు ఇది సంకేతం. దశావతారాల్లో నాలుగోది అయిన నృసింహ అవతారం కాగా, బ్రహ్మోత్సవాల్లో నాలుగు వాహనం కూడా సింహమే కావడం గమనార్హం. సింహవాహనంపై శ్రీనివాసుడి ఊరేగింపు సందర్భంగా వీధులు భక్తులతో కిటకిటలాడాయి.
సింహవాహనంపై శ్రీవారు ఉరేగిన సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద యెత్తున తిరుమలకు తరలి వచ్చారు. లక్ష మంది భక్తులు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు.

సింహవాహంపై శ్రీవారు..
బ్రహ్మోత్సావాల్లో భాగంగా శ్రీవేంకటేశ్వర స్వామి సోమవారం సింహవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగాడు. దాదాపు లక్ష మంది భక్తులు ఈ సందర్బంగా తిరుమలకు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు.

శక్తికి, వేగానికి ప్రతీక
సింహం శక్తికి, వేగానికి ప్రతీకగా యోగ శాస్త్రంలో చెప్పారు. అందువల్ల శ్రీవారికి సింహాన్ని వాహనంగా చేశారని అంటారు. శ్రీవారి ఆలయ సముదాయంలోని ఆనంద నిలయంలో సింహాల విగ్రహాలు ఉన్నాయి. సింహాల పట్ల తిరుమలేశుడికి గల ప్రేమకు ఇది ప్రతీక అంటారు.

పులకించిన భక్తులు..
తిరుమాడ వీధుల్లో సింహవాహనంపై ఊరేగిన తిరుమలేశుడిని కన్నులారా చూసి భక్తులు పులకించిపోయారు. తమ ఇష్టదైవానికి దండాలు సమర్పించుకున్నారు.

లక్ష్మీనర్సింహ స్వామి అవతారం
తిరుమలేశుడి చెంత యోగ ముద్రలో గల నర్సింహస్వామి దేవాలయం, లక్ష్మీనర్సింహ స్వామి విగ్రహం విష్ణువు నర్సింహావతారం ప్రాధాన్యాన్ని చెబుతుంది.

పోటెత్తిన భక్త జనం
తిరుమల బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. దాదాపు లక్ష మందికిపైగా భక్తులు తిరుమలకు చేరుకున్నట్లు అంచనా వేస్తున్నారు.

టిటిడి చైర్మన్ తదితరులు..
శ్రీవారి ఊరేగింపు కార్యక్రమంలో కనుమూరి బాపిరాజు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎఁజి గోపాల్, జెఇవో కెఎస్ శ్రీనావసరావు, జివిజి అశోక్ కుమార్, చిన్నమంగారి రమణ, మునిరత్నం రెడ్డి, రామారావు, శివకుమార్, ఆర్ సెల్వమ్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications