విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

srujana death: పెళ్లి ఆపే ప్రయత్నంలోనే విషాదం: ప్రియుడికి సమాచారం ఇచ్చిన సృజన

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నవ వధువు సృజన మృతి కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. పెళ్లి ఆపాలనే ప్రయత్నంలోనే ఆమె ప్రాణాలు పోగొట్టుకున్నట్లు పోలీసులు తేల్చారు. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారించారు. అనుమానాస్పాద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వివిధ కోణాల్లో దర్యాప్తు చేయడంతో చివరకు చిక్కుముడి వీడింది.

మోహన్ అనే యువకుడితో ప్రేమలో సృజన

మోహన్ అనే యువకుడితో ప్రేమలో సృజన

విశాఖపట్నం మధురవాడకు చెందిన సృజన ఫోన్లో కాల్ డయల్ రికార్డర్, వాట్సాప్, ఇన్ స్టాగ్రాంలను పరిశీలించగా పలు కీలక విషయాలు తెలిసాయి. విశాఖ నగరంలోని పరవాడకు చెందిన తోకాడ మోహన్ అనే యువకుడితో ఏడేళ్లుగా సృజనకు ప్రేమ వ్యవహారం నడుస్తోంది. పెళ్లికి మూడు రోజుల ముందే ప్రియుడితో ఆమె ఇన్‌స్టాగ్రాంలో చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఆ పెళ్లి ఇష్టం లేదని ప్రియుడికి చెప్పిన సృజన

ఆ పెళ్లి ఇష్టం లేదని ప్రియుడికి చెప్పిన సృజన

ఇంట్లో వాళ్లు చేస్తున్న పెళ్లి తనకు ఇష్టం లేదని, తనను తీసుకెళ్లాలని మోహన్‌ను సృజన కోరింది. అయితే, ఆర్థికంగా తాను ఇంకా స్థిరపడలేదని, సరైన ఉద్యోగం కూడా లేదంటూ పెళ్లికి మోహన్ నిరాకరిస్తూ వచ్చాడు. అయితే, కొంత సమయం నిరీక్షించాలని సృజనను కోరాడు మోహన్.ఆమె కూడా అతని కోసం మరికొంత కాలం వేచిచూడాలని అనుకుంది.

ఇష్టం లేని పెళ్లిని.. సృజన ఆపే ప్రయత్నం విషాదంగా మారింది

ఇష్టం లేని పెళ్లిని.. సృజన ఆపే ప్రయత్నం విషాదంగా మారింది

ఇది ఇలావుండగా, మరోవైపు సృజనకు కుటుంబసభ్యులు మే 11న వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఈ పెళ్లి ఇష్టం లేని సృజన.. దీన్ని ఆపేందుకు ప్రయత్నిస్తానని మోహన్‌కు చెప్పినట్లు తెలిసింది. పెళ్లి ఆపే ప్రయత్నంలో భాగంగానే సృజన విషపదార్థం సేవించింది. కానీ, అనుకోని విధంగా పెళ్లి పీటలపైనే ఆమె కుప్పకూలింది. ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. దర్యాప్తులో భాగంగా తేలిన ఈ విషయాలను పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే మీడియా సమావేశంలో పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

English summary
srujana death case: suicide attempted to stop marriage, but, this turned into tragedy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X