ఒకే కుటుంబంలో 4గురు మృతి, జార్ఖండ్ నుంచి వచ్చి కనిపించలేదు

రాజమండ్రి: శ్రీకాకుళం జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన 14 మంది కలిసి పుష్కరాలకు వెళ్లారు. మంగళవారం జరిగిన తొక్కిసలాటలో అందులోని నలుగురు మృతి చెందారు. సంతకవిటి మండలం బొద్దూరుకు చెందిన కొత్తకోట కళావతికి ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

కుమారుడు రాజు, కోడలు జానకి, వారిద్దరి పిల్లలు బొద్దాంలో ఉంటున్నారు. పెద్ద కుమార్తె పొట్నూరు అమరావతిలో ఉంటోంది. ఆమె భర్త జనార్ధన్ రావు ఆముదాలవలస గేటు వద్ద కొబ్బరికాయల వ్యాపారం చేస్తుంటాడు.

ఇంటి పెద్ద జనార్దన రావు పరిస్థితి ఆసుపత్రిలో ఉన్నవాళ్ల కళ్ల నీళ్లు సుళ్లు తిరిగేలా చేసింది. ఆయన భార్య అమరావతి, మరదలు లక్ష్మి, మరో మరదలు కుమారుడు ప్రశాంత్‌, అత్త కొత్తకోట కళావతి చనిపోయారు.

stampede at godavari pushkaralu in ap: man loses 4 of his kin, son,

విశాఖపట్నంలోని పెందుర్తి నుంచి 20మంది ఓ బృందంగా వచ్చారు. ఘాట్‌ దగ్గర జరిగిన తొక్కిసలాటతో వాళ్లంతా తలోదిక్కు అయిపోయారు. నాళం పద్మకి తన తల్లి గొర్లె మంగాయమ్మ జాడ దొరకలేదు. ఆమె శవం ఆసుపత్రిలో లభించింది. ఆమె గొర్లె మంగాయమ్మ.

ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా భువనగిరిపాలెంకి చెందిన కుందూరు లక్ష్మయ్య కుటుంబ సభ్యులు నలుగురు గోదావరిలో పుణ్య స్నానం కోసం వచ్చారు. ఘాట్‌ తెరవలేదని మాట్లాడుకుంటుండగా.. తొక్కిసలాట మొదలైంది. దీంతో లక్ష్మయ్య భార్య జానకమ్మ తుదిశ్వాస విడిచారు.

బస్సు కండక్టరుగా పని చేసే పోలయ్య తన కుటుంబంతో నెల్లూరు నుంచి పుష్కర స్నానానికి వచ్చి తొక్కిసలాటలో భార్య రాజేశ్వరిని కోల్పోయారు.

విశాఖలో ఆటో డ్రైవరుగా పని చేసే కృష్ణ తన భార్య బంగారమ్మ, కుమార్తె గౌరి, కుమారుడు రాంబాబుతో వచ్చారు. తొక్కిసలాటలో బంగారమ్మ, గౌరి మృతి చెందగా కృష్ణ, అతని కుమారుడు రాంబాబు మిగిలారు. మృతదేహాల వద్ద వీరు విలపిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

పుణ్యం కోసం పుష్కర స్నానం చేసేందుకు జార్ఖండ్‌ నుంచి వచ్చిన పంప మీనాక్షి పుష్కర ఘటనలో మృతి చెందారు. ఆమె ఫొటోని చూపుతూ మనుమడు శ్రీనివాస్‌ విలపించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+