వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జోరులో రోజా, హేమ స్టార్ తిరిగేనా: జయసుధ రెండోసారి

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలలో ఆయా పార్టీల నుండి పలువురు ప్రముఖ నటీనటులు పోటీ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ అయిన పలువురు రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు కష్టపడుతున్నారు.

టిడిపి నుండి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి లోకసభ బరిలో మురళీ మోహన్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గ బరిలో రోజా, కాంగ్రెసు పార్టీ నుండి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి జయసుధ, మదనపల్లె అసెంబ్లీకి కారెక్టర్ ఆర్టిస్ట్ హేమ జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున.. ఇలా పలువురు బరిలో నిలిచారు.

మురళీ మోహన్, రోజాలు గతంలో పోటీ చేసి ఓడిపోయారు. వారు ఎంతో కాలం నుండి రాజకీయాల్లో ఉంటున్నారు. జయసుధ మాత్రం తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఇక విజయశాంతి కూడా కాంగ్రెసు నుండి బరిలో నిలిచారు.

రోజా

రోజా

ప్రముఖ నటి రోజా సినిమాలలో హిట్ అయ్యారు. అయితే, రాజకీయాల్లో మాత్రం నెగ్గు వచ్చేందుకు ఆమె ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదు.

రోజా

రోజా

రోజా తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఇప్పుడు చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి జగన్ పార్టీ తరఫున బరిలో ఉన్నారు.

రోజా

రోజా

రోజా గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున టిడిపి సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు పైన పోటీ చేస్తున్నారు. ఈసారైనా అసెంబ్లీకి వెళ్లాలనే ఆమె కోరిక నెరవేరుతుందో చూడాలి.

రోజా

రోజా

2009 ఎన్నికల అనంతరం రోజా నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ రాజశేఖర రెడ్డిని కలిశారు. అప్పుడు ఆమె కాంగ్రెసులోకి వెళ్లేందుకే కలిశారనే ప్రచారం సాగింది.

రోజా

రోజా

అయితే, ఆ తర్వాత ఆయన అకాలమృతి, వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్థాపించిన నేపథ్యంలో ఆమె జగన్ వైపు మొగ్గారు.

రోజా

రోజా

ఇప్పుడు ఆమె చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈసారి ఆమె గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

విజయశాంతి

విజయశాంతి

విజయశాంతి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహిళా నాయకురాలు. మొదట బిజెపిలో ఉన్న ఆమె ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. ఆ తర్వాత తెరాసలో తన పార్టీని విలీనం చేశారు.

విజయశాంతి

విజయశాంతి

తెరాస అధ్యక్షులు కెసిఆర్‌తో ఆమెకు విభేదాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె బిజెపి వైపు మొగ్గు చూపారు. అదే సమయంలో కాంగ్రెసు తెలంగాణ ఇవ్వడంతో ఆ పార్టీలో చేరిన విజయశాంతి... మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఆమె 2009లో మెదక్ పార్లమెంటు నుండి గెలిచారు.

జయసుధ

జయసుధ

ప్రముఖ నటి జయసుధ 2009లో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చీ రాగానే ఆమె సికింద్రాబాద్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు మరోసారి కాంగ్రెసు పార్టీ నుండే పోటీ చేస్తున్నారు. మధ్యలో ఆమె జగన్ వైపు మొగ్గు చూపినట్లు కనిపించినా తర్వాత తగ్గారు.

జీవిత

జీవిత

దర్శక నిర్మాత జీవిత ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అయితే ఆమె భారతీయ జనతా పార్టీ తరఫున ఉధృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.

హేమ

హేమ

ప్రముఖ కారెక్టర్ నటి హేమ ఈ సార్వత్రిక ఎన్నికలలో కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ నుండి మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు.

English summary
The Congress party has been bringing popular actors for campaign in the elections. Actors such as Vijayashanti, Jayaprada, and Jayasudha will campaign for the Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X