విక్టరీ: బ్యాలెన్స్ చేస్తూ బాబు గట్టెక్కారు (పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్రాన్ని వరుసగా తుఫానులు అతలాకుతలం చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బాధితులను ఆదుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం మండిపడ్డారు. ఆయన తూర్పు గోదావరి జిల్లాలో హెలెన్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా విభజన పైనా మాట్లాడారు.

అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. విభజనపై కేంద్రం రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరముందని స్పష్టంచేశారు. గతంలో అసెంబ్లీ తీర్మానాల ద్వారానే మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశారని, ఇక్కడ అసెంబ్లీని చులకన చేస్తే ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు.

371(డి), 371(ఇ) ఆర్టికల్స్ ను సవరించాలంటే పార్లమెంట్‌లో 2/3 మెజారిటీ అవసరమన్నారు. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే జాతీయ పార్టీలేవీ అంగీకరించవని, తాము కూడా ఒప్పుకోబోమని తెలిపారు.

బాబు 1

బాబు 1

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండను ప్రజా సమస్యల పరిష్కారానికి కాకుండా, రాజకీయ ప్రచార కార్యక్రమంగా ఉపయోగించుకుంటున్నారని బాబు విమర్శించారు.

బాబు 2

బాబు 2

రాష్ట్ర ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేది మరొకటిలా ఉందన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా ముందు మాట్లాడలేకపోతున్నారని సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

బాబు 3

బాబు 3

ఢిల్లీ పెద్దల వద్ద కాంగ్రెస్ నాయకులు వంగి దండాలు పెడుతున్నారే తప్ప ప్రజా సమస్యలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర హీనురాలై పోతుందన్నారు.

బాబు 4

బాబు 4

తనపై కేసుల మాఫీ కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బిజీగా ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

బాబు 5

బాబు 5

సోనియా గాంధీ ముందు రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడుతూ.. ఇక్కడ సమైక్యాంధ్ర జపం చేస్తూ ఆంద్రులను మోసగిస్తున్నారని విమర్శించారు.

బాబు 6

బాబు 6

సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణాలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల ద్వారా రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందన్నారు.

బాబు 7

బాబు 7

కాంగ్రెసు పార్టీ కుట్రలు, కుయుక్తులను జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ ఆందోళన చేసిందని చంద్రబాబు గుర్తు చేశారు.

బాబు 8

బాబు 8

ఇరు ప్రాంత ప్రజలను ఒప్పించడం ద్వారా మాత్రమే విభజన సాధ్యమన్నారు. తెరాస, జగన్ పార్టీలతో సోనియా చేతులు కలిపి తెలుగు జాతిని విచ్ఛిన్నం చేస్తుండటాన్ని అందరూ అర్థం చేసుకోవాలన్నారు.

బాబు 9

బాబు 9

సమన్యాయం చేయకుంటే తాము విభజనను అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు.

బాబు 10

బాబు 10

చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా కొత్తకోట మండలంలో తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

బాబు 11

బాబు 11

రాష్ట్రంపై వరుసగా విపత్తులు దాడి చేస్తున్నప్పటికీ సాయం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కిరణ్‌కు తుఫాను బాధితుల సమస్యలకన్నా రచ్చబండే ఎక్కువయిందన్నారు.

బాబు 12

బాబు 12

విభజనపై కేంద్రం నిర్ణయాలతో సీమాంధ్రులు భయాందోళనకు గురవుతున్నారని, సమన్యాయం చేయకుంటే విభజనను అడ్డుకుంటామన్నారు.

బాబు 13

బాబు 13

రాష్ట్రాన్ని వరుసగా తుఫానులు అతలాకుతలం చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బాధితులను ఆదుకోవడం లేదని నారా చంద్రబాబు నాయుడు సోమవారం మండిపడ్డారు.

బాబు 14

బాబు 14

చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలో హెలెన్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా విభజన అంశం పైనా మాట్లాడారు.

బాబు 15

బాబు 15

అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. విభజనపై కేంద్రం రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

బాబు 16

బాబు 16

అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరముందని స్పష్టంచేశారు. గతంలో అసెంబ్లీ తీర్మానాల ద్వారానే మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశారని, ఇక్కడ అసెంబ్లీని చులకన చేస్తే ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు.

బాబు 17

బాబు 17

371(డి), 371(ఇ) ఆర్టికల్స్ ను సవరించాలంటే పార్లమెంట్‌లో 2/3 మెజారిటీ అవసరమన్నారు. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే జాతీయ పార్టీలేవీ అంగీకరించవని, తాము కూడా ఒప్పుకోబోమని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+