వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదే పదే మోసం, చంద్రబాబు పాలనకు ఇక చరమగీతమే: వైయస్ జగన్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నయవంచనతో పాలన సాగిస్తున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని వైయస్ జగన్ ధ్వజమెత్తారు.

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరులో విషజ్వరాల బారినపడి మృతిచెందిన 18మంది కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు విధానాలపై జగన్ నిప్పులు చెరిగారు.

ఎన్నికల్లో శుష్క వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో బాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు. మోసపూరిత హామీలతో అందలమెక్కిన చంద్రబాబు పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోందన్నారు. ప్రజాసమస్యలను గాలికి వదిలేసిన సిఎం సింగపూర్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని దుయ్యబట్టారు.

ధర్నా

ధర్నా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

నయవంచనతో పాలన సాగిస్తున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని వైయస్ జగన్ ధ్వజమెత్తారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరులో విషజ్వరాల బారినపడి మృతిచెందిన 18మంది కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.

ధర్నా

ధర్నా

ఈ సందర్భంగా చంద్రబాబు విధానాలపై జగన్ నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో శుష్క వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో బాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

మోసపూరిత హామీలతో అందలమెక్కిన చంద్రబాబు పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోందన్నారు. ప్రజాసమస్యలను గాలికి వదిలేసిన సిఎం సింగపూర్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని దుయ్యబట్టారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

ప్రజారోగ్యాలతో చెలగాటమాడుతూ రాష్ట్రాన్ని జ్వరాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.

ప్రజారోగ్యాలతో చెలగాటమాడుతూ రాష్ట్రాన్ని జ్వరాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. సిఎం స్థానంలో వున్న వ్యక్తే ప్రజల బాగోగులు పట్టించుకోకుంటే వారి గోడు వినేది ఎవరని ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలబడే పార్టీ ఒక్క వైయస్సార్ కాంగ్రెస్సేనని అన్నారు.

త్వరలోనే చంద్రబాబు పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారన్నారు. రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనన్నారు. తాను ముఖ్యమంత్రి అయిన వారంరోజుల్లో కొత్త మాజేరు గ్రామంలో విషజ్వరాల బారినపడి 18 మంది మృతుల కుటుంబాల ఇళ్లకు నేరుగా చెక్కులు పంపిస్తానని జగన్ హామీ ఇచ్చారు.

ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ర్టానికి ప్రత్యేక హోదా విషయాన్ని ప్రస్తావించకుండా ప్రజల్ని పదేపదే మోసం చేస్తున్నారనివైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ప్రధానిని కలిసి తాడోపేడో తేల్చుకుంటానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు.. ప్రత్యేక హోదాను ప్రస్తావించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

English summary
Opposition leader and YSR Congress Party president Y.S. Jaganmohan Reddy on Tuesday criticised the Telugu Desam Party for failing to prevent spread of viral fevers at Kotha Majeru village where at least 18 people died since June.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X