ప్రధానికి అరుదైన స్వాగతం - ‘ఐరన్‌’ శిల్పాలు, చారిత్రక ఘట్టం..!!

అమరావతిలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ప్రధాని మోదీ గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో అమరావతి సభా వేదిక వద్దకు చేరుకుంటారు. ప్రధానికి అరుదైన స్వాగతం లభించింది. అమరావతి పనుల రీ లాంఛ్ సభ కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పా ట్లు చేసింది. భారీగా రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ప్రజలు తరలి వచ్చారు. భారీ జన సంద్రం కనిపిస్తోంది. ఇక, ఈ వేడుక వేళ ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన ఐరన్ శిల్పాలు ఆకట్టుకుంటున్నాయి.

రాజధాని అమరావతి పునః ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు రాజధాని ప్రాంతానికి చేరుకుంటున్నారు. సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బుద్ధుడు, కాలచక్రం, ఎన్టీఆర్‌, ప్రధాని నరేంద్రమోదీ విగ్రహాలతో పాటు మేక్‌ ఇన్‌ ఇండియా లోగో ఆకట్టుకుంటున్నాయి. దీంతో పాటు 'అమరావతి' అక్షరాలను రూపొందించారు. వీటిని ఐరన్‌ స్క్రాప్‌తో శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు తీర్చిదిద్దారు. వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం ఆసక్తి చూపుతున్నారు. ఆ విగ్రహాల వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.

statues-with-iron-scrap-in-amaravati-becomes-attractive

రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి సగర్వంగా ముస్తాబైంది. అమరావతి పునఃప్రారంభం పేరిట ప్రభుత్వం భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తుండగా రాజధానిలోని వెలగపూడిలో దాదాపు 276 ఎకరాల్లో అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ఈ సభకు హాజరై రాజధాని పనులు పునః ప్రారంభించనున్నారు. ఈ పనుల ప్రారంభానికి ప్రతీకగా అమరావతి పైలాన్ ను ఆవిష్కరించనున్నారు. మొత్తంగా రాజధాని పనులు సహా 57,940 కోట్ల రూపాయల మేర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీకి అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ స్వాగతం పలకనున్నారు. ఇక, పనుల రీ లాంఛ్ పైలాన్ ఆవిష్కరణ ద్వారా సభ ప్రారంభం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+