పిక్చర్: విద్యార్థి ఆత్మహత్య, నో సూసైడ్ నోట్
హైదరాబాద్: ఎంసెట్‌కు సిద్ధమవుతున్న ఓ 18 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారంనాడు హైదరాబాదులోని కొత్తపేటలో గల హాస్టల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతుడిని మహబూబ్‌నగర్ జిల్లా మాడుగులకు చెందిన కోటేశు కుమారుడు వినయ్ కుమార్‌గా గుర్తించారు.

కొత్తపేటలోని చైతన్య జూనియర్ కాలేజీలో వినయ్ ఇటీవలే ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. కాలేజీ ఆవరణలోని హాస్టల్లో ఉంటూ అతను ఎంసెట్‌కు చదువుకుంటున్నాడు. శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. తోటి విద్యార్థులు హాస్టల్ గదిలోని ఐరన్ రాడుకు అతని శవం వేలాడుతుండడాన్ని గుర్తించారు.
తెల్లవారు జామను బాత్రూం తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉండడాన్ని విద్యార్థులు గుర్తించారు. వారికి అనుమానం వచ్చింది. హాస్టల్ నిర్వాహకులు బలవంతంగా తలుపు తెరిచారు. బెడ్ షీట్‌తో షోవర్ రాడ్‌కు వినయ్ ఉరి వేసుకుని ఉండడాన్ని వారు గుర్తించారు.

ఎంసెట్‌లో తగిన ర్యాంక్ రాదనే భయంతో అతను ఈ పనికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. అయితే, సూసైడ్ నోట్ ఏదీ పోలీసులకు కనిపించలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.












Click it and Unblock the Notifications