Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వణికిస్తున్న సడన్ హార్ట్ ఎటాక్ లు: ఏపీలో మరో ఇద్దరు విద్యార్థులు గుండెపోటుతో మృతి!!

పెరిగిపోతున్న హార్ట్ ఎటాక్ లు అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఏపీలో మరో ఇద్దరు విద్యార్థులు గుండెపోటుతో మృతి చెందిన ఘటనలు వారి కుటుంబాల్లో శోకాన్ని మిగిల్చాయి.

గుండెపోటు.. ఇప్పుడు ప్రతి ఒక్కరిని వణికిస్తున్న పదం. అకస్మాత్తుగా గుండెపోటు బారినపడి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా నిత్యం అనేకమంది సడన్ హార్ట్ ఎటాక్ కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక తాజాగా యుక్త వయసులో ఉన్న పిల్లలు నిలుచున్న చోటే పడిపోయి ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తుంది. చిన్న చిన్న పిల్లలు, ఆడుకునే వయసులోనూ హార్ట్ ఎటాక్ ల బారిన పడుతున్నారు. అసలు మృత్యువు ఎప్పుడు, ఎవరిని, ఏ విధంగా కబళిస్తుంది అన్నది అర్థం కాక అందరిలోనూ భయం పట్టుకుంది.

ఏపీలో గుండెపోటుకు ఇద్దరు యువకులు బలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఇద్దరు కాలేజీ విద్యార్థులు అకస్మాత్తు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఆ తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చగా, ప్రతి ఒక్కరూ ఈ మరణాలపై ఆలోచించేలా చేస్తుంది. ఇక వారిద్దరూ 20 ఏళ్లలోపు వాళ్లే కావడం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల కాలంలో యుక్త వయస్సు వారిలో గుండె పోటు ప్రమాదం బాగా ఎక్కువగా కనిపిస్తుంది. మరణాలు కలవరపెడుతున్నాయి. బతుకు భద్రతను ప్రశ్నిస్తున్నాయి.

17ఏళ్ళ వయసులో నిద్రలోనే గుండెపోటుతో విద్యార్థి మృతి

17ఏళ్ళ వయసులో నిద్రలోనే గుండెపోటుతో విద్యార్థి మృతి

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రుకు చెందిన 17 సంవత్సరాల వయసున్న ఫిరోజ్ ఖాన్ చిలకలూరిపేటలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి చదువుకుని నిద్రపోయిన విద్యార్థి నిద్రలో పెద్దగా గురక పెట్టడంతో పక్కనే ఉన్న సోదరి ఫర్జానా భయపడి తల్లిదండ్రులను నిద్రలేపింది.

వారు వచ్చి కుమారుడికి మంచి నీళ్లు తాగించాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్తే విద్యార్థిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. తమ కుమారుడికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని, ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవాడని, శ్రద్ధగా చదువుకునేవాడని తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు.

19 ఏళ్ళ తనూజ్ నాయక్ కబడ్డీ ఆడుతూ కుప్ప కూలి మృతి

19 ఏళ్ళ తనూజ్ నాయక్ కబడ్డీ ఆడుతూ కుప్ప కూలి మృతి

ఇదిలా ఉంటే అనంతపురంలోని ప్రైవేట్ కళాశాలలో బీఫార్మసీ చదువుతున్న 19 సంవత్సరాల తనూజ్ నాయక్ ఈనెల 1వ తేదీన కళాశాల ప్రాంగణంలో కబడ్డీ ఆడుతూ ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే అతన్ని స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

దాదాపు వారం రోజులపాటు ఆసుపత్రిలో ప్రాణం కోసం కొట్లాడిన విద్యార్థి సోమవారం అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటు వల్లే తమ కుమారుడు మృతి చెందాడని వైద్యులు చెప్పినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బాగా అభివృద్ధిలోకి వస్తాడు అనుకున్న కొడుకు హఠాత్తుగా మరణించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

ప్రతీ ఒక్కరూ సీపీఆర్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది

ప్రతీ ఒక్కరూ సీపీఆర్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది

ఇక ఇటువంటి ఘటనలు వరుసగా చోటు చేసుకోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది. అకస్మాత్తుగా వస్తున్న గుండెపోటుల కేసులు పెరగడంతో ప్రతి ఒక్కరు సిపిఆర్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు పదేపదే చెబుతున్నారు. ముఖ్యంగా యువత ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చెయ్యటం మంచిది కాదని అంటున్నారు. సమయానుకూలంగా సిపిఆర్ చేయగలిగితే వారి ప్రాణాలను కాపాడవచ్చు అని చెప్తున్నారు. ఈ మేరకు పలువురు హృద్రోగ నిపుణులు చాలామందికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+